• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss Telugu 5 Elimination: ఓటింగ్‌లో అట్టడుగున ఆ స్పైసీ బ్యూటీ: బలయ్యేది ఈ కంటెస్టెంటే..!!

|
Google Oneindia TeluguNews

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్-5లో ఇంటి సభ్యుల మధ్య క్రమంగా కాంట్రవర్శీలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన నామినేషన్ల సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య పెద్ద గొడవే జరిగింది. ప్రియా ఏకంగా రవి లహరిల మధ్య అర్థరాత్రి టాయ్‌లెట్‌లో ఏదో జరిగిందంటూ వివాదాస్పదమైన కామెంట్స్ చేయడంతో హౌజ్ ఒక్కసారిగా హీటెక్కిన విషయం తెలిసిందే.

అయితే తను చూశాను కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లు సమర్థించుకుంది ప్రియా. ఇక ఆ తర్వాత హౌజ్‌లోని సభ్యుల మధ్య రకరకాలుగా చర్చలు జరిగాయి. ఇక నామినేషన్స్ కార్యక్రమం కూడా ముగిసింది. మూడవ వారంలో మొత్తం ఐదుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం తథ్యం. అయితే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.. ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు..?

నామినేషన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

నామినేషన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ సీజన్ 5 హీటెక్కింది. ఎంతలా అంటే సభ్యుల మధ్య ఇలానే కాంట్రవర్శీ కొనసాగితే ఏకంగా ఇంటికే నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. సభ్యులు కూడా మరీ వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు. ప్రియా చేసిన కామెంట్స్, అంతకు ముందు వారం సిరి టీషర్టులో సన్నీ చేయి పెట్టాడని తాను ఫీల్ అయినట్లు చెప్పడంలాంటివి చూస్తే ఏకంగా వ్యక్తిగత క్యారక్టర్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి.

ఇక ఈ వారంలో ఇంటికి బయటకు వచ్చేందుకుగాను చేపట్టే నామినేషన్స్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో సింగర్ శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, లహరి, ప్రియాంక సింగ్‌లు ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ కూడా షురూ అయ్యింది. అయితే ప్రేక్షకులు మాత్రం ఓటింగ్ సమయంలో చాలా అంశాలను దృష్టిలో ఉంచుకుని కంటెస్టెంట్లకు ఓటు వేస్తున్నారు. తక్కువ ఓట్లు పోలైన వారికి ఎలిమినేషన్ తప్పదు.

తక్కువ ఓట్లు వీరిద్దరికే...

తక్కువ ఓట్లు వీరిద్దరికే...

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సారి నామినేషన్‌లో ఉన్న ఐదుగురిలో మానస్‌కు అత్యధిక ఓట్లు రాగా... ఆ తర్వాత ప్రియాంక మరియు ప్రియాలకు ఓట్లు వచ్చాయి. ఎటొచ్చి అందరూ షాక్ అయ్యేలా శ్రీరామచంద్ర, లహరిలకు తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే శ్రీరామచంద్ర, లహరిలు తప్పకుండా ఫైనల్స్ వరకు వచ్చే కంటెస్టెంట్లుగా నిలుస్తారని అంతా భావిస్తున్న నేపథ్యంలో వీరిద్దరికీ అతి తక్కువగా ఓట్లు పోల్ కావడం నిజంగా ఆలోచింపచేసే విషయమే అవుతుంది. లహరి తన గ్లామర్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లో నెట్టుకొస్తోంది. అంతేకాదు గత సీజన్‌లో అఖిల్ సార్థక్- మోనాల్ మధ్య జరిగిన లవ్ ట్రాక్‌ను లహరి క్యారీ చేయగలదనే ఒపీనియన్ కూడా ఉంది.

అయితే లహరి ఎలిమినేషన్‌కు మాత్రం ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. అయితే ఇది బిగ్‌బాస్ హౌజ్ కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇక శ్రీరామచంద్ర విషయానికొస్తే అతను సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

 నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు..

మరి ఓటింగ్ విషయంలో తక్కువ ఓట్లు వచ్చిన వారు సేఫ్ అవుతారా.. అంటే అయ్యే అవకాశాలున్నాయి లేదా.. బిగ్ బాస్ కరుణించి మరొక కంటెస్టెంట్‌ను బలి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ సెకండ్ కేస్‌ను తీసుకుంటే అంటే మరో కంటెస్టెంట్‌ను బలి చేయాలని భావిస్తే అది కచ్చితంగా నటి ప్రియా అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అవును ప్రియా చేసిన ఒకే ఒక కాంట్రవర్శియల్ స్టేట్‌మెంట్‌తో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే గతవారంలో ఎలిమినేట్ అయిన సీనియర్ నటి ఉమా కూడా ఒకే ఒక్క తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది. అసభ్యకర పదజాలం వాడటంతో ఇటు ప్రేక్షకులు అటు బిగ్‌బాస్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెకు మరొక అవకాశం లేకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.

ప్రియా నోరే చేటు తెచ్చిపెట్టిందా..

ప్రియా నోరే చేటు తెచ్చిపెట్టిందా..

ప్రస్తుతం నటి ప్రియాకు బిగ్‌బాస్‌ హౌజ్‌లో రోజులు దగ్గరపడ్డాయనే విషయం స్పష్టమవుతోంది. లహరి-రవిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రియాను బిగ్‌బాస్ హౌజ్‌కు దూరం చేసే అవకాశాలున్నాయి. ఇద్దరికీ ప్రియా క్షమాపణ చెప్పినప్పటికీ బిగ్‌బాస్, ప్రేక్షకులు మాత్రం ఆమెను క్షమించేలా కనిపించడం లేదు. పైగా ఆమె హౌజ్‌కు కరెక్టు కాదనే అభిప్రాయంలో ఉన్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో కాంట్రవర్శీలు ఉండాలి కానీ దానికి ఓ హద్దు ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సభ్యులు చేసే కాంట్రవర్శీ వ్యాఖ్యలతో వ్యక్తిగత జీవితాలకు, లేదా వారి కుటుంబ సభ్యుల జీవితాలకు భంగం వాటిల్లేలా ఉండకూడదని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కాబట్టి ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 లహరి వైపే నెటిజెన్లు.. ఎందుకంటే..

లహరి వైపే నెటిజెన్లు.. ఎందుకంటే..

ఇక లహరిని బిగ్‌బాస్ సేవ్ చేసే అవకాశాలు లేకపోలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓటింగ్ పరంగా చూస్తే లహరి అట్టడుగున ఉన్నట్లు సమాచారం. కానీ ఈ స్పైసీ బ్యూటీని ఇంటి నుంచి పంపితే షో డల్ అయ్యే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో రేటింగ్‌ కూడా పడిపోయే అవకాశాలున్నాయంటూ మరో చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే ప్రియా వ్యాఖ్యలు లహరికి కలిసొచ్చే అవకాశాలున్నాయని దీంతో ఈ అర్జున్ రెడ్డి బ్యూటీ ఈ వారానికి ఎలిమినేషన్ నుంచి బతికిపోతుందనే చర్చ వాడీవేడీగా సాగుతోంది. కొందరు లహరిని చూసేందుకే బిగ్‌ బాస్ షోను చూస్తున్నట్లు చెప్పుకురావడం మరో కొసమెరుపు.

మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 5 కిరాక్ రియాల్టీ షోగా మారుతోంది. కాంట్రవర్శీలతో అట్టుడుకుపోతోంది. బిగ్‌ బాస్ టాస్కులు కూడా అలానే ఉండటంతో షో కాస్త రక్తికడుతోంది.

English summary
As the week end is approaching there is buzz making rounds that Priya may be eliminated in the ongoing Bigg Boss Telugu season 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X