• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss 5 Telugu: ఓటింగ్‌లో దుమ్ము రేపుతున్న యూట్యూబర్: ఆ ఇద్దరికీ తక్కువ ఓట్లు: డేంజర్‌లో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో- రోజులు గడిచే కొద్దీ వీక్షకులను ఉత్కంఠతకు గురి చేస్తోంది. టీవీల ముందు కట్టి పడేస్తోంది. ప్రత్యేకించి- వీకెండ్ డేస్‌లల్లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లను మిస్ కావడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. ఫలితంగా టీఆర్పీ రేటింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి.

నలుగురు ఎలిమినేట్..

నలుగురు ఎలిమినేట్..

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలి మూడు వారాల్లో ఫిమేల్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. తొలి వారం యూట్యూబర్ సరయు, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారం సెలెబ్రిటీ లహరి షారీ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఇక నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ నిరాశ పరిచారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి మేల్ కంటెస్టెంట్ ఆయనే.

నేచురాలిటీని కోల్పోయారా?

నేచురాలిటీని కోల్పోయారా?

ఈ ముగ్గురు కూడా వీక్షకుల అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. బయట ఎలా ఉండేవారో.. అలా సహజంగా వారు బిగ్ బాస్‌లో కొనసాగలేకపోయారనేది నెటిజన్ల అభిప్రాయం. కృత్రిమంగా కనిపించారని, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లోనూ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయారనే టాక్ ఉంది. అవసరం లేని సందర్భాల్లోనూ అతిగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ దఫా తొమ్మిది మంది

ఈ దఫా తొమ్మిది మంది

అయిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 15 మందిలో సగం మందికి పైగా అంటే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్టేనని తెలుస్తోంది. నటి ప్రియ, హమీదా ఎలిమినేషన్ రిస్క్‌లోకి వెళ్లారు. వారితోపాటు షణ్ముఖ్ జశ్వంత్, విశ్వ, యాంకర్ రవి, లోబో, వీజే సన్ని, మానస్ నాగులపల్లి, జెస్సీ ఈ వారం నామినేట్ అయ్యారు. మొత్తం తొమ్మిదిమంది ఈ సారి నామినేట్ అయ్యారు.

ఓటింగ్ ప్రక్రియ బిగిన్స్

ఓటింగ్ ప్రక్రియ బిగిన్స్

ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తొమ్మిది మంది నామినేట్ అయిన కంటెస్టెంట్లలో టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఓటింగ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. అతనికి హయ్యెస్ట్ ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుతానికి అతనే టాపర్‌గా నిలిచాడు. 44.60 శాతం అంటే 14,906 ఓట్లు పడ్డాయి అతనికి. రెండో స్థానంలో సన్నీ నిలిచాడు. అతనికి 18.29 శాతం.. అంటే 6,114 ఓట్లు పోల్ అయ్యాయి. 8.76 శాతం ఓట్లతో మానస్ నాగులపల్లి మూడో స్థానంలో ఉన్నాడు. అతనికి పడ్డ ఓట్లు 2,926.

డేంజర్ జోన్‌లో హమీదా, విశ్వ..

డేంజర్ జోన్‌లో హమీదా, విశ్వ..

మానస్ తరువాత నాలుగో స్థానంలో యాంకర్ రవి నిలిచాడు. అతనికి 2,400 ఓట్లు పడ్డాయి. ప్రియ-2,077, జెస్సీ-1,678, లోబో-1,405 మేర ఓట్లను సాధించారు. ఇక హమీద, విశ్వ చిట్ట చివరి స్థానాల్లో నిలిచారు. హమీదాకు 2.99 శాతం మాత్రమే ఓట్ల పోల్ అయ్యాయి. వెయ్యి కంటే తక్కువకే అంటే 998 ఓట్లు పడ్డాయి.

ఆమె కంటే తక్కువ ఓట్లు విశ్వకు పోల్ అయ్యాయి. అతనికి వచ్చిన ఓట్ల శాతం 2.74 అంటే 916. హమీద, విశ్వ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటోంది. ఇద్దరి మధ్య ఉన్న ఓట్ల శాతం తక్కువే. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఈ వారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడానికి అవకాశాలు ఉన్నట్టేనని నెటిజన్లు అంచనా వేస్తోన్నారు.

English summary
Bigg Boss 5 Telugu Voting Results Today: Shanmukh Jaswanth Leads And Hamida In Danger Zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X