bigg boss-5:విన్నరే శ్రీరామ చంద్రే..? ప్రేక్షకుల వర్షన్ కాదు.. మరీ ఎవరిదంటే
బిగ్ బాస్-5 తెలుగు టైటిల్ ఎవరూ గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు వీజే సన్నీ టైటిల్ గెలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. శ్రీరామ చంద్ర.. రన్నరప్ అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ హౌజ్ మెట్స్ మాత్రం విభిన్నంగా స్పందించారు. అంటే మొత్తం మారలే.. కానీ అటు ఇటు అవుతున్నారు. ప్రేక్షకులు ఎవరిని గెలిపించారనే విషయం పక్కకు పెడితే.. హౌస్‌మేట్స్ మనసులు గెలుచుకుంది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది.
గ్రాండ్ ఫినాలేలో నాగార్జున బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ముచ్చటించారు. టాప్ 5లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్నకు హౌస్‌మేట్స్ వారి అభిప్రాయాలను వెల్లడించారు. రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్ ఇవ్వగా శ్వేత, నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు.

ఇక ప్రియాంక సింగ్ మాత్రం ఏకంగా ముగ్గురి పేర్లను వెల్లడించింది. మానస్, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు గెలిచినా ఓకే అని చెప్పింది. వీళ్ల అభిప్రాయం ప్రకారం శ్రీరామ్ విన్నర్ అయితే సన్నీ రన్నర్‌గా నిలుస్తాడన్నమాట. మరి వీరి అంచనా ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి మరీ. మరీ కాసేపట్లో ఫైనలిస్ట్ పేరు ప్రపంచానికి అధికారికంగా తెలియనుంది.
సన్నీ టైటిల్ గెలుస్తారనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. శ్రీరామ చంద్ర.. ఇతను కూడా పాటలు పాడుతూ బాగానే ఆడాడు. చాలా సందర్భాల్లో నాగార్జున కూడా సపోర్ట్ చేశారు. తాను ఒంటరినని చాలా సందర్భాల్లో చెప్పారు. నేనున్నా అంటూ నాగ్ భరోసా ఇచ్చారు. ఓట్లు కూడా బానే పడుతున్న.. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. టైటిల్ గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే గత వారం గాయం కావడంతో బిగ్ బాస్-5 ఫైనలిస్ట్‌గా నిలిచినా.. ఆడలేదనే బాధ అతనికి ఉంది. జనం కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు వేశారా అనే సందేహాం నెలకొంది. కానీ ఇప్పుడు ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications