• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:ఈ సారి ఎలిమినేషన్‌పై క్లారిటీ.. ఏదో అద్భుతం జరిగితే తప్ప..! ఎవరంటే..?

|

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాల్టీషో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఈ మధ్యకాలంలో బిగ్‌ బాస్ షో వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఒకానొక సమయంలో బిగ్‌బాస్ షో పై తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ హౌజ్‌లో క్రమంగా రక్తి కట్టించే టాస్కులు, లవ్ స్టోరీలు, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మందకొడిగా ప్రారంభమైన బిగ్‌బాస్ షో... ఆ తర్వాత రెండో వారంలో కాస్త పుంజుకుంది. ఇందుకు కారణం మోనాల్-అఖిల్-అభిజీత్ అని చాలా మంది చెబుతారు. ఇక అసలు విషయానికొస్తే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

 టీఆర్‌పీ రేటింగ్స్ కోసమే...

టీఆర్‌పీ రేటింగ్స్ కోసమే...

బిగ్‌బాస్ రియాల్టీ షో క్రమంగా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు వారు చేసే పెర్ఫార్మెన్స్‌తో షో రక్తి కడుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి మాత్రం నెట్టింట్లో దుమారం రేగుతోంది. ఈ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదనేది నెటిజెన్ల వాదన. ఇక ప్రతి సారి సేవ్ అవుతూ వస్తున్న ఉత్తరాది భామ మోనాల్ గజ్జర్ ఈ సారి ఎగ్జిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. గతవారమే మోనాల్ బయటకు రావాల్సి ఉన్నప్పటికీ టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం మోనాల్‌ను బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేయలేదనేది ఇన్‌సైడ్ సమాచారం.

మోనాల్ కంటే నేనే బాగా ఆడుతున్నాను

మోనాల్ కంటే నేనే బాగా ఆడుతున్నాను

ఇక ఈ వారం నామినేషన్‌ విషయానికొస్తే మోనాల్‌ను అఖిల్ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ టాస్కులు ఇచ్చిన సందర్భంలో మోనాల్‌ కంటే తానే బాగా ఆడుతున్నట్లు అఖిల్ చెప్పుకొచ్చాడు. ఎవరైతే హౌజ్‌లో బిగ్‌బాస్ టాస్కులు చక్కగా పెర్ఫార్మ్ చేస్తారో వారికి మాత్రమే చోటు ఉంటుందని కరాకండిగా చెప్పేశాడు. దీంతో వీరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్‌కు కాస్త విఘాతం కలుగుతుందేమోననే చర్చ నెటిజెన్లు అప్పుడే సోషల్ మీడియా వేదికగా పెట్టేశారు. తాను ఇచ్చిన టాస్కును బాగా చేస్తున్నాడు కాబట్టి తనకు ఇంటిలో ఉండే అర్హత ఉందని అఖిల్ చెప్పకనే చెప్పేశాడు. అయితే అఖిల్ నామినేట్ చేయడంతో మోనాల్ కూడా ఒక్క మాట మాట్లాడకుండానే నామినేషన్స్‌లో ఉండేందుకు అంగీకారం తెలిపింది.

మోనాల్‌ను ఇంటినుంచి పంపేందుకు ఫిక్స్

మోనాల్‌ను ఇంటినుంచి పంపేందుకు ఫిక్స్

ఇదిలా ఉంటే మోనాల్‌ను ఎలిమినేట్ చేయకుండా కుమార్‌సాయిని ఇంటినుంచి పంపడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఓటింగ్‌తో పనిలేకుండా బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసే ప్రకారమైతే ఇంత కథ ఎందుకంటూ బాహాటంగానే ఆర్గనైజర్స్‌పై విమర్శలు సంధించారు ప్రేక్షకులు. ఒకానొక సమయంలో హోస్ట్ నాగార్జునపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఇక సోషల్ మీడియాలో రన్ అవుతున్న నెగిటివ్ క్యాంపెయిన్‌ నుంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మోనాల్‌ను ఇంటి నుంచి పంపేద్దామని దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మోనాల్ కాకుండా మరో కంటెస్టెంట్‌ ఎలిమినేట్ కావాలంటే ఏదో అద్భుతం జరగాలి. అది జరిగితే తప్ప మోనాల్‌కు ఇంట్లో ఉండే అవకాశం ఉండదని సమాచారం.

  Bigg Boss Telugu 4: Monal Akhil Hugs మోనాల్‌ను సేవ్ చెయ్యటం కోసం కుమార్ సాయిని ఎలిమినేట్ !!
  మోనాల్ వెళితే... ఆ తర్వాతి వారంలో అఖిల్..?

  మోనాల్ వెళితే... ఆ తర్వాతి వారంలో అఖిల్..?

  ఒకవేళ మోనాల్ ఇంటినుంచి ఎగ్జిట్ అయితే అఖిల్ ఆమెను నామినేట్ చేశాడు కాబట్టి తన నిర్ణయం పై ఎలా రియాక్ట్ అవుతాడో అనేదానిపై ఆసక్తి కలుగుతోంది. మోనాల్ లేకుండా ఇంట్లో గేమ్ ఆడలేని స్థితికి అఖిల్ చేరుకున్నాడంటే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఒకవేళ మోనాల్ ఎలిమినేట్ ఆ తర్వాత ఇంటినుంచి ఎగ్జిట్ అయ్యేది అఖిల్ అని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.మోనాల్ ఇంటిని వీడిన తర్వాత అఖిల్ ఆటపై ఏమాత్రం ఫోకస్ చేస్తాడో చూడాలని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పటికే ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్న మోనాల్ ఈ వారంలో కూడా సేవ్ అవుతుందా లేక ఎగ్జిట్ అవుతుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ వారాంతం బిగ్‌బాస్ ఎపిసోడ్‌ను ఎట్టిపరిస్థితుల్లో మిస్ కాకూడదు.

  English summary
  This week for sure shot Monal is going to be evicted unless until a miracle takes place from the Bigg Boss house if sources are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X