Bigg Boss Telugu 5: హాట్‌ హాట్‌గా హౌస్‌: సగం మంది నామినేట్: ఎలిమినేట్ ప్రక్రియలో బిగ్ స్కెచ్

హైదరాబాద్: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. అయిదో వారంలోకి అడుగు పెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎలిమినేషన్ డే వచ్చే సమయానికి ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతున్నారు.. బయటికి వెళ్లిపోతున్నారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ షో నుంచి ఇప్పటిదాకా నలుగురు కంటెస్టెంట్లు.. ఇంటి దారి పట్టారు. ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఎంపిక చేయడానికి ఉద్దేశించిన కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే విషయంలో ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది బిగ్‌బాస్ ఆర్గనైజర్స్.

 కొత్త ఫార్ములా

కొత్త ఫార్ములా


హౌస్ నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతి సోమవారం ఉంటుందనే విషయం తెలిసిందే. తమకు నచ్చని, స్ట్రాంగ్ కాంపిటిటర్‌గా భావించిన వారిని కంటెస్టెంట్లు నామినేట్ ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఇదివరకు ఎప్పుడూ పెద్దగా లేనివిధంగా ఓ కొత్త ఫార్ములాను బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయిదు లేదా ఆరుమందిని నామినేట్ చేస్తుండే వారు. ఈ సంఖ్య కాస్తా ప్రస్తుతం ఎనిమిదికి చేరింది. నాలుగో వారంలో ఎనిమిది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు.

 ఈ సారి తొమ్మిదికి..

ఈ సారి తొమ్మిదికి..

అయిదో వారంలో ఈ సంఖ్య తొమ్మిదికి పెరిగిందని తెలుస్తోంది. అంటే సగం మందికి పైగా కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయినట్టే. తొలి వారంలో సరయు, రెండోవారంలో ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యారు. ఫోర్త్ వీక్‌లో నటరాజ్ మాస్టర్ బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ నలుగురు పోనూ- ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో సగం మందికి పైగా ఈ వారం నామినేట్ అయ్యారనేది టాక్.

ఈ సారి ఇద్దరే ఫిమేల్ కంటెస్టెంట్..

ఈ సారి ఇద్దరే ఫిమేల్ కంటెస్టెంట్..


అయిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయిన తొమ్మిదిమందిలో ఇద్దరు మాత్రమే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నటి ప్రియ మరోసారి నామినేట్ అయ్యారు. ఆమెతో పాటు హమీదా ఈ సారి ఎలిమినేషన్ రిస్క్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ జశ్వంత్, విశ్వ, యాంకర్ రవి, లోబో, వీజే సన్ని, మానస్ నాగులపల్లి, జెస్సీ ఈ వారం నామినేట్ అయ్యారని తెలుస్తోంది. మొత్తం తొమ్మిదిమంది ఈ సారి నామినేట్ అయ్యారు. ప్రియాంక సింగ్ (పింకీ), శ్రీరామచంద్ర, సిరి హన్మంతు, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, శ్వేత వర్మ ఈ సారి నామినేట్ కాలేదని సమాచారం.

ఆ ట్రెడీషన్ కొనసాగుతుందా?


ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిన కంటెస్టెంట్లలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. సరయు, ఉమాదేవి, లహరి షారీ బయటికి వెళ్లారు. దాన్ని బ్రేక్ చేశాడు నటరాజ్ మాస్టర్. నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇదే ట్రెడీషన్ కొనసాగుతుందా? లేక మళ్లీ ఫిమేల్ కంటెస్టెంట్లు ఎవిక్ట్ అవుతారా? అనేది ఆసక్తిగా మారింది. నటి ప్రియ, హమీదా కాస్త సేఫ్ గేమ్ ఆడుతోన్న నేపథ్యంలో- ఈ సారి కూడా మేల్ కంటెస్టెంట్లే బయటికి వెళ్లాల్సి వస్తుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+