• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:లీక్ ఇచ్చిన గంగవ్వ.. సూట్‌కేస్ సర్దేసిన సుజాత..వారి ఓట్లతో మాస్టర్ సేఫ్..?

|

బిగ్‌బాస్‌లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి ఎలిమినేషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఇంట్లో ఉంటారు... ఎవరు బయటకొస్తారు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే ఈ సారి ఎలిమినేట్ అవుతారంటూ ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకరు అమ్మా రాజశేఖర్ కాగా మరొకరు సుజాత. ఇక వీరిద్దరి మధ్యే ఎలిమినేషన్‌కు పోటీ జరుగుతోంది. మిగతా వారంత సేఫ్ సైడ్‌లో ఉన్నట్లు ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. ఇక వెళుతూ వెళుతూ గంగవ్వ చిన్న లీక్ ఇచ్చింది. అది ఎవరూ అంతగా గమనించి ఉండరు.

  Bigg Boss Telugu 4 : Jordar Sujatha Is Out From Bigg Boss House || Oneindia Telugu
   ఎలిమినేషన్ ప్రక్రియ పై అనుమానాలు

  ఎలిమినేషన్ ప్రక్రియ పై అనుమానాలు

  బిగ్‌బాస్ షో ప్రారంభమై అప్పుడే ఐదువారాలు అయిపోయింది. ప్రతి వారం ఒకరి చొప్పున ఎలిమినేషన్ జరుగుతోంది. మధ్యలో ఓ సారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ఎంటర్ అయిన స్వాతి దీక్షిత్ ఎగ్జిట్ కూడా అయిపోయింది. ఇక ఓటింగ్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియలపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఇందుకు ఉదాహరణ స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేయడమే. తాను ఆడిన గేమ్‌ను షో నిర్వాహకులు ఎడిటింగ్‌లో తీసేసి టెలికాస్ట్ చేశారని తనను ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదని కరాకంఢిగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక చూస్తున్న ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతోంది. ఒకరి కోసం మరొకరి బలిచేస్తున్నారనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది.

   అమ్మ రాజశేఖర్‌కు కలిసొచ్చిందేమిటి..

  అమ్మ రాజశేఖర్‌కు కలిసొచ్చిందేమిటి..

  ఇక ఎలిమినేషన్ ప్రక్రియపై అనుమానాలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ వారాంతంలో మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సారి ఇంటి నుంచి ఎవరు ఎగ్జిట్ అవుతారనేదానిపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. నామినేషన్‌లో తొమ్మిది మంది ఉన్నప్పటికీ... అమ్మా రాజశేఖర్ సుజాతలకు అతి తక్కువగా ఓట్లు రావడంతో వీరిద్దరే రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే అమ్మా రాజశేఖర్‌కు తమిళనాడు నుంచి కూడా ఓట్లు రావడంతో ఆయన సేఫ్‌ అయినట్లు సమాచారం. ఇక్కడే సుజాతకు మైనస్ అయినట్లు తెలుస్తోంది.

   బిట్టూ బేబీ ఔట్..?

  బిట్టూ బేబీ ఔట్..?

  ఇక బిట్టూ అంటూ నాగార్జునకు బిస్కెట్ వేసిన సుజాత ఈ సారి ఎలిమినేట్ అవుతారని బలంగా వినిపిస్తోంది. ఇంటిలో సుజాత తీరుపై పలువురు ఇంటి సభ్యులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె నవ్వులో సహజత్వం లేదని కావాలనే నవ్వు మరీ తెచ్చుకుని నవ్వుతుందనేది ఇటు ఇంటి సభ్యుల్లో అటు టీవీల్లో కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో భావన కలిగింది. బిట్టూ అంటూ నాగార్జునను పిలవడం చూస్తే సుజాత ఓవరాక్షన్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టులు పెట్టుకొచ్చారు. ఇంట్లో ఉండేందుకు సుజాత బాగా ఆడినప్పటికీ కొన్ని విషయాలను గమనించిన ప్రేక్షకులు ఆమెను ఎలిమినేట్ చేయాలనే భావించినట్లు ఆమెపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను చూస్తే అర్థమవుతుంది. మరోవైపు గత రెండు వారాల్లో సుజాత నామినేషన్‌లోకి రాకుండా ఎస్కేప్ అయ్యింది. లేదంటే దేవీ నాగవల్లి కంటే ముందుగానే ఆమె ఇంటిని వీడాల్సి వచ్చి ఉండేది. ఈ సారి మాత్రం ఎస్కేప్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక అనారోగ్యం కారణంగా బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి గంగవ్వ వెళుతూ వెళుతూ సుజాత కూడా తన తర్వాతే వస్తుందంటూ లీక్ ఇవ్వడంతో ఆమె ఎలిమినేషన్ పై అనుమానాలు మరింత బలపడ్డాయి.

   మోనాల్‌ను బిగ్‌బాస్ సేవ్ చేస్తున్నాడా..

  మోనాల్‌ను బిగ్‌బాస్ సేవ్ చేస్తున్నాడా..

  ఇక ఉత్తరాది భామ మోనాల్ గజ్జర్‌కు ఓట్లు ఎవరు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆమె ఇంటిలో ఉండేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మోనాల్ ఉండటం వల్ల హౌజ్‌లో కాస్త స్పైస్ ఎక్కువగా ఉండటమే కాకుండా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా రక్తి కడుతుండటంతో దాదాపుగా ఆమె ఎలిమినేట్ కారనే స్పష్టం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి భావోద్వేగానికి గురవుతుండటం కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదు. మరి అలాంటప్పుడు మోనాల్‌కు కచ్చితంగా తక్కువ ఓట్లే వచ్చి ఉంటాయని ,కానీ ఆమె ఎందుకు ఎలిమినేట్ కావడం లేదో అర్థం కావడం లేదని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

   డబుల్ ఎలిమినేషన్ ఉంటే...

  డబుల్ ఎలిమినేషన్ ఉంటే...

  మొత్తానికి ఈ వీకెండ్‌లో సుజాతనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అమ్మా రాజశేఖర్ కూడా సూట్‌కేస్ సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం కొందరి అభిప్రాయాల ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఏమైనా జరిగే అవకాశాలున్నాయి. సుజాత ప్లేస్‌లో అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావొచ్చు లేదా చివరి నిమిషంలో మరొకరు కావొచ్చు. ఇదంతా తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్స్‌ను మిస్ కాకూడదు.

  English summary
  Sujatha the Bigg Boss Telugu contestant will be eliminated this week if sources are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X