హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో ఇదేం గేమ్ రా బాబూ.!అటు అవినాష్ ఆటిట్యూడ్..ఇటు సోహైల్ సిల్లీనెస్..మద్యలో అమాయక అరియానా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్4 లో కంటెస్టెంట్ల మద్య రసవత్తర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ పరిణతి చెందిన భావాలను పంచుకోవాల్సిన వేదిక మీద కోపం, ఆవేశం, ఆగ్రహం, అసహనం, ఆక్రోశం, అసంతృప్తి వెల్లగక్కుతున్నారు కొంత మంది ఇంటి సభ్యులు. తనకోపమే తన శత్రువు అనే పద్యాన్ని చిన్న తనం నుండి వింటూనే వస్తున్నాం.

సమాజంలో అన్ని కుగ్మతలకు పట్టరాని ఆవేశం, కోపమే కరణమని తెలిసినా ఇంటి సభ్యులు కొందరు వీరావేశంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ లోని ఇంటి సభ్యుల ప్రవర్తన చిత్రవిచిత్రంగా పరిణమించింది.

 చిత్ర విచిత్రాల వేదిక..

చిత్ర విచిత్రాల వేదిక..

ఎందుకు అరుచుకుంటారో తెలియదు.. ఎందుకు వాదించుకుంటారో తెలియదు.. దేనికోసం తపన పడతారా అసలే అర్ధం కాదు.. ఎందుకు ఒకే వేదిక మీద రకరకాల మనస్తత్వాల, రకరకాల అభిరుచుల సభ్యులను చేర్చారో ఏమాత్రం తెలియదు. తమ వృత్తిలో ఓనమాలు కూడా పూర్తి చేసారో లేదో తెలియదు గాని అవినాష్ లాంటి ఇంటి సభ్యులు చూపిస్తున్న ఆటిట్యూడ్ మాత్రం పరాకాష్టకు చేరినట్టు తెలుస్తోంది. కామెడీ చేస్తే నేనే చేయాలి తప్ప ఇంకెవరూ చేయొద్దనే అవినాష్ వితండ వాదన ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

 ఎవరికి వారు తోపులు..

ఎవరికి వారు తోపులు..

ఎదురుగా ఆడపిల్ల అరియానా ఎంతో సౌమ్యంగా, మరెంతో వినయంగా ఓ టాస్క్ గురించి వివరిస్తున్నప్పుడు సోహైల్ లాంటి కంటెస్టెంట్ కన్నెర్ర చేస్తూ చూపించిన ఉక్రోశం దారుణంగా పరిణమించింది. అంత కోపం, ఆవేశం ఏంటని టీవి చూస్తున్న బిగ్ బాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఓ ఆడపిల్ల హౌస్ లో ఉన్న సభ్యులకు దిశా నిర్దేశం చేస్తుందంటే ఎంతో సహనం, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంతే కాక ఇంటి సభ్యులందరి పట్ల వివక్ష చూపకుండా సమాన దృష్టితో నడిపించాలి. అరియానా ఈ అంశంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అంత మాత్రాన ఆవిడి మీద కారాలు మిరియాలు నూరితే ఏంటి ప్రయోజనం అనే వాస్తవాన్ని సోహైల్ లాంటి కంటెస్టెంట్లు గమనిస్తే మంచిది.

కారణం లేకున్నా ఆవేశంతో ఊగిపోతున్న సభ్యులు..

కారణం లేకున్నా ఆవేశంతో ఊగిపోతున్న సభ్యులు..

అసలు బిగ్ బాస్4 లోని ఇంటి సభ్యులను సునిశితంగా పరిశీలిస్తే వారికి పరిపక్వత ఉందా అనే సందేహం కలగక మానదు. ఎదుటి వారికి ఇవ్వడంలో ఉన్న సంతృప్తి తీసుకునే దాంట్లో ఉండదు. కాని ఇంటి సభ్యులందరూ లాక్కునే గుణంతో ఉన్నట్టు వారి వారి మనోభావాలను బట్టి అర్థమవుతోంది. ప్రతి ఇంటి సభ్యులు ఎవరికి వారు తోపు అనుకునే భ్రమలో ఉన్నారు తప్ప ఇంకా నేర్చుకునేది చాలా ఉందనే చిన్ని లాజిక్ ను మర్చి పోయినట్టు తెలుస్తోంది. బిగ్ హౌస్ లో పాల్గొనే అవకాశం రావడమే ఓ పెద్ద దైవకార్యమైనట్టు, వారి మేధావితనాన్ని చూసి హౌస్ మెంబర్ గా ఎంపిక చేసినట్టు ప్రతిఒక్కరూ చిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది.

 అమ్మ ఆటలో అరటి పండే..

అమ్మ ఆటలో అరటి పండే..

చివరగా అమ్మ రాజశేఖర్ గురించి కాస్త చెప్పక తప్పదు. అన్ని అంశాల్లో తల దూర్చాలనుకుంటాడు గానీ ఏ అంశంలో కూడా అంత ప్రావీణ్యం ఉన్నట్టు కనిపించడం లేదు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ తమిళ నృత్య దర్శకుడు మతి తప్పాడో, గాడి తప్పాడో, శృతి తప్పాడో, ట్రాక్ తప్పాడో తెలియని అయోమయ పరిస్థితిల్లో కాలం నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. హౌస్ లో ఉంచినన్ని రోజులు ఉందాం.. వెళ్లమంటే వెళ్లిపోదాం అనే అటిట్యూడ్ తప్ప హౌలో వ్యవహరించాల్సిన అంశాల పట్ల ఏమాత్రం పరిజ్ఞానం లేనట్టు వ్యవహరిస్తున్న అమ్మ రాజశేఖర్ కూడా జనాన్ని బాగా విసిగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నవ్వుల పువ్వులు పూయిస్తూ ఎన్నో తీపి జ్ఞాపకాలను మోసుకెళ్లాల్సిన కంటెస్టెంట్లు చేదు అనుభవాలతో వెనుతిరుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Bigg Boss Season 4 features juicy scenes between contestants.Some House members are expressing impatience and dissatisfaction on the stage where they have to share the mature feelings of being friendly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X