హరీశ్ పద్దు మేడిపండు చందంలా ఉంది.. రఘునందన్ రావు విమర్శలు
తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అయితే పద్దుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బడ్జెట్ మేడిపండు చందంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. బడ్జెట్ చూస్తే కళ్లు తిరిగి కింద పడాల్సిందేనని సెటైర్ వేశారు. గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తామని చెబుతూ వస్తున్నారని ఫైరయ్యారు. 2014 నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని రఘునందన్‌రావు విమర్శించారు.
బడ్జెట్ పుస్తకాలకే పరిమితం అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మూసీ నదికి కేటాయించిన కోట్లు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌గా తయారైందని రాజాసింగ్ విమర్శించారు. హరీశ్ పద్దుపై బీజేపీ తప్పుపట్టింది. ముఖ్యమైన రంగాలను పట్టించుకోలేదని.. విస్మరించడం సరికాదు అని చెప్పారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మొత్తం బడ్జెట్ విలువ రూ.2,30,825 కోట్లు అని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని రూ.1,69,383.44 కోట్లుగా చూపించిన మంత్రి హరీశ్.. ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లుగా, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లుగా, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications