మరో మూడేళ్లూ కేసీఆరే సీఎం: మరో షాకిస్తామంటూ టీఆర్ఎస్ సర్కారుకు బండి సంజయ్ హెచ్చిరిక
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబ, గడీల, అవినీతి ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతంపాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీనేనని స్పస్టం చేశారు.
Recommended Video

కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్‌కు లేదు..
ఇక మరో మూడేళ్లూ ముఖ్యమంత్రి కేసీఆరేనని.. కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన ఆయనకు లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు బీజేపీవైపు నిలబడుతున్నారని.. ఇందుకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.
సముద్ర తీరాన ఇషా తల్వార్.. అందాల ఆరబోతతో...

బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామంటూ బండి సంజయ్..
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మేల్యేల కబ్జాల పర్వానికి కేసీఆర్ చరమగీతం పాడకపోతే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే.. కమీషన్ల పేరిట కోట్లకు కోట్లు వెనకేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేయాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని అన్నారు.

కేసీఆర్ ఆరేళ్ల అవినీతి చిట్టా విప్పుతానంటున్న బండి సంజయ్
కేసీఆర్ కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలనే టీఆర్ఎస్ ప్రయత్నాన్ని మరోసారి ప్రజలు తిప్పేకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ నిర్ణయాలతో ప్రజలకు తీరని నష్టాలు
సోమవారం జరిగిన ఓ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులేనని, వీరికి మంత్రి పదవులు ఇచ్చేందుకేనా రాష్ట్రాన్ని సాధించిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ద్రోహులే అధికారంలో ఉండాలన్న తరహాలో పరిపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలతో ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని అన్నారు. నియంత్రిత సాగు కొనసాగించడం సాధ్యం కాదని, ధరణి పూర్తిగా విఫలమవుతుందని బీజేపీ ముందుగానే చెప్పిందని మరో నేత మురళీధర్ రావు అన్నారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా మరుతోందన్నారు. కేటీఆర్ మంత్రి పదవి లేకుండా కొన్ని నెలలు కూడా ఉండలేకపోయారని.. కానీ, యూనివర్సిటీల్లో మాత్రం వైస్ ఛాన్స్‌లర్లను నియమించడం లేదని మండిపడ్డారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు డప్పు సైన్యాలుగా మారారని విమర్శించారు.












Click it and Unblock the Notifications