TSPSC Paper Leak: నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమడుతుంది: బండి సంజయ్
టీఎస్‍పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పేపర్ లీక్ పై టీఎస్‍పీఎస్సీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బండి తప్పుబట్టారు. అరెస్టయిన కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
ధరణి స్కాం, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్, ఇప్పుడు జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కూడా కేటీఆర్ కనుసన్నంల్లోనే జరిగాయని ఆరోపించారు. పేపర్ లీక్ పై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్ కాలేజీ విద్యార్థులంతా కాలేజీ ముందు బైఠాయింది నిరసన తెలిపారు. టీఎస్‍పీఎస్సీ ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోఠీ విమెన్స్ కాలేజీ విద్యార్థులు కూడా పేపర్ లీకే పై నిరసన చేపట్టారు.

ఏబీవీపీ విద్యార్థులంతా కాలేజీ నుంచి బయటివెళ్లి నిరసన తెలియజేసే క్రమంలో పోలీసులు వచ్చి గేటుకు తాళం వేశారు. మరోవైపు పేపర్ లీక్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ పేపర్ ఎంత మందికి లీక్ చేశారనే దానిపై విచారణ జరుగుతుంది. ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఏఈ పేపర్ కాకుండా మిగతా పేపర్లు కూడా ఉన్నాయి. కానీ అతను ఏఈ పేపర్ ఒక్కటే లీక్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications