వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
వికారాబాద్ అడవుల్లో బుల్లెట్, మ్యాగ్జిన్ కనిపించింది. పశువులను మేపడానికి వెళ్లిన వారు.. గ్రామస్తులు చూశారు. వెంటనే సర్పంచికి సమాచారం అందజేశారు. ఆయన అటవీ శాఖ అధికారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇవీ ఎక్కడినుంచి వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.
యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో బుల్లెట్ కనిపంచింది. పక్కనే మ్యాగ్జిన్ కూడా ఉంది. దీంతో కలకలం నెలకొంది. ఇవీ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటవీలో ఎవరైనా వేటకు వచ్చారా అని అనుమానిస్తున్నారు. లేదంటే ఇతరులు ఎవరైనా వచ్చారా అని కూడా భావిస్తున్నారు. గొడవలు వల్ల వదిలేసి పోయారా... లేదంటే మావోయిస్టులకు సంబంధించిన తుపాకీ అని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా ఇక్కడ స్తబ్దుగా ఉండగా ఒక్కసారిగా బుల్లెట్ కనిపించింది. దీంతో ఎవరూ ఇక్కడ వదిలి వెళ్లారని అనుమానిస్తున్నారు. గొడవల వల్ల చేశారా లేదంటే.. మావోయిస్టులు.. ఇతరుల ప్రభావం ఉందా అని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. విచారణలో నిజ నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications