హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతలోనే ఇలా.. జోడో యాత్రకు కాపీ రైట్ చిక్కులు, రాహుల్ సహా నేతలపై కేసులు

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో మంచి జోష్‌తో కంటిన్యూ అవుతుంది. యాత్రలో వివాదం నెలకొంది. పాదయాత్రలో భాగంగా కేజీఎఫ్-2 పాటను వాడుకున్నారని ఆ సినిమా పాటలపై హక్కులు కలిగిన సంస్థ పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో రాహుల్ గాంధీ, ఇతర నేతలపై కేసు కూడా ఫైల్ అయ్యింది.

బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంది. కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు భారీ మొత్తంలో చెల్లించామని అందులో వివరించింది.

 Case against Rahul Gandhi use of KGF-2 songs

కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుండా ఆ పాటలను వాడుకుంటున్నారని గుర్తుచేసింది. పాటల బ్యాక్ గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారని ఎమ్మార్టీ మ్యూజిక్ ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా భారత్ జోడో యాత్రకు తమ పాటలను వాడుకుంటున్నారని ఆరోపించింది. దీంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ, నేతలపై ఐటీ లా ప్రకారం 403, 465, 120, 34, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 63 కాపీరైట్ యాక్ట్ 1957 కింద మరో కేసు ఫైల్ చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో జోష్ వచ్చింది. రాహుల్ సహా నేతలు అంతా ఉత్సాహాంగా పాల్గొంటున్నారు. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతున్నారు. ఇవాళ ఏకంగా నేతలు అంతా డ్యాన్స్ చేశారు. స్టేజీ మీద తమ పార్టీకి ఊపును తీసుకొచ్చారు. కానీ కాపీ రైట్ కింద కేసు ఫైల్ కావడంతో ఒక్కసారిగా ఊసురుమనే పరిస్థితి ఏర్పడింది.

English summary
MRT Music company has filed case against Congress leaders Rahul Gandhi, Supriya Srinate and Jairam Ramesh for copyright infringement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X