Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్జీవీకి సీఈసీ షాక్: ‘పవర్ స్టార్’ పోస్టర్లకు నో పర్మిషన్, రూ.88 వేల ఫైన్

రాం గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ ఎలా హిట్ అవుతుందో.. వివాదాలు కూడా అలానే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్జీబీ వరల్డ్ థియేటర్‌లో వర్మ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో పవర్ స్టార్ పోస్టర్ విచ్చలవిడిగా అంటించారు. దీనిపై ఒకరు ఫిర్యాదు చేయగా.. నిన్న జీహెచ్ఎంసీ రూ.4 వేల జరిమానా కూడా విధించింది. అయితే సిటీలో అలా చాలా పోస్టర్లకు అనుమతి తీసుకోలేదని తెలిసింది.

30కి పైగా పోస్టర్లు..

30కి పైగా పోస్టర్లు..

హైదరాబాద్‌లో 30కి పైగా మూవీ పోస్టర్లను వేశారు. అయితే ఏ ఒక్క దానికి కూడా అనుమతి తీసుకోలేదు. దీంతో సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ కొరడా ఝులిపించింది. సిటీ మొత్తం డీఆర్ఎఫ్ బృందాలతో పరిశీలించింది. ఏ ఒక్క దానికి కూడా అనుమతి తీసుకోలేదని తెలుసుకొని జరిమానా విధించింది. ఆర్జీవీకి 88 వేల ఫైన్ వేస్తున్నట్టు తెలిపింది.

నిన్న రూ.4 వేలు..

నిన్న రూ.4 వేలు..

ఇదే అంశంపై జీహెచ్ఎంసీ రూ.4 వేల జరిమానా కూడా విధించింది. 'పవర్‌ స్టార్‌ ' సినిమాకు సంబంధించి రామ్‌ గోపాల్ ‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఒకరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్‌ వేయాలని ఈవీడీఎం విభాగానికి తెలిపారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఈవీడీఎం విభాగం ఈ నెల 22వ తేదీన వర్మకు రూ.4 వేల జరిమానా విధిస్తూ చలాన్ జారీచేసింది.

Recommended Video

    గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.? Adire Abhi Opinion On RGV || Oneindia Telugu
    ఆర్జీవీ వరల్డ్ థియేటర్

    ఆర్జీవీ వరల్డ్ థియేటర్

    పవర్ స్టార్ సినిమాను ఈ నెల 25 న దానిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ లో విడుదల చేసాడు. పవన్ కళ్యాణ్ ‌పై సినిమా అంటూ వర్మ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. 37 నిమిషాల విడిదితో సినిమా తీయగా.. ఏముంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఆర్జీవీ ఆఫీసుపై కూడా ప‌లువురు దాడికి పాల్పడ్డారు. అయితే మూవీలో రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎన్నిక ఫలితాల తరువాత పవన్ కల్యాణ్..అనుభవించిన మానసిక వేదనను మాత్రమే చూపించి.. క్యాష్ చేసుకున్నాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+