హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ పీఏనంటూ మోసం.. ఛీటర్ నాగరాజు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏనని చెబుతూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతోపాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌‌ లక్షల రూపాయలకు మోసం చేశాడు. నాగరాజు నుంచి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోసాలకు సంబంధించి గతంలోనూ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. అయినా అతని తీరు మారలేదు. ఫిబ్రవరిలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పి తొమ్మిది కార్పొరేట్ కంపెనీలను మోసం చేశాడు. వారి నుంచి భారీగానే డబ్బును గుంజాడు. బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ కేసులు నమోదు అయ్యాయి.

cheater nagaraju arrested

నాగరాజుపై పీడీ యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేశారు. గత మూడేళ్ల నుంచి నాగరాజుపై కేసులు ఉన్నాయి. ఇంటర్ స్టేట్ క్రిమినల్‌‌గా మారిపోయాడు.క్రికెట్ కిట్లను ఫ్రీగా ఇస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. నాగరాజు మోసాలకు సంబంధించి ఒక్కో విషయ బయటకు వస్తోంది. అన్నీ కేసులను ఫైల్ చేస్తామని పోలీసులు తెలిపారు.

English summary
cheater nagaraju arrested who told to some one iam minister ktr pa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X