రేపాసురులకు ఉరి: ప్రతి పౌరుడూ జటాయువుగా మారాలి: చిల్కూర్ బాలాజీ ఆలయ అర్చకులు
హైదరాబాద్: ఆడపిల్లని రక్షించడంలో సమాజం దారుణంగా విఫలమవుతోందని చిల్కూర్ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్వామి అన్నారు. మహిళలు, యువతులు, చిన్న పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో సమాజంతో పాటు, ప్రతి అందులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరు సఫలం కావట్లేదని చెప్పారు. మహిళలను వినోద వస్తువు, ఆటబొమ్మగా భావించే వారికి రేపాసుర అనే ముద్ర వేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని అన్నారు.
ఈ ఉదయం ఆయన సైదాబాద్ సింగరేణి కాలనీలో- కామాంధుడు పళ్లంకొండ రాజు చేతిలో అత్యాచారం.. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ బాలిక చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. రేపిస్టులను ఉరి తీయాలనే తన డిమాండ్‌తో ప్రజలందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు. దేవుడే అతనికి తగిన శిక్ష విధించాడని వ్యాఖ్యానించారు.

రామాయణంలో సీతమ్మ తల్లిని రావణుడి చెర నుంచి విడిపించడానికి జటాయువు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిందని, ఆడపిల్లలను రక్షించే విషయంలో ప్రతి ఒక్కరు పౌరుడు జటాయువుగా మారాలని అన్నారు. ఆడపిల్లలను సంరక్షించుకోవడాన్ని తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని రంగరాజన్ అన్నారు. మహిళలకు భద్రత కల్పించడానికి దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ.. అవి సరిపోవట్లేదని అన్నారు.
మగవాళ్ళ వక్రబుద్ధి, వక్రదృష్టి నుంచి మహిళలను రక్షించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలు చాలట్లేదని చెప్పారు. మహిళలకు రక్షణకు సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. యువత రాక్షసులు కాకుండా రక్షకులుగా ఉండాలని ఆయన సూచించారు. అమ్మాయిలు, మహిళలు, చిన్న పిల్లల పట్ల రాక్షస స్వభావాన్ని సమాజం విడనాడాలని, వారిపట్ల రక్షకులుగా మారాలని అన్నారు. మహిళలను చూసే దృష్టికోణం మారినప్పుడే వారికి రక్షణ కలుగుతుందని రంగరాజన్ పేర్కొన్నారు.
రేపాసురులకు ఉరి: ప్రతి పౌరుడూ జటాయువుగా మారాలి: చిల్కూర్ బాలాజీ ఆలయ అర్చకులు#Hyderabad, #Saidabad #CSRangarajan #ChilkurBalajitemple pic.twitter.com/IV7z3Ol1XP
— oneindiatelugu (@oneindiatelugu) September 16, 2021
ఆడవాళ్ళకి సురక్షితమైన సమాజాన్ని నిర్మించే ధ్యేయంతో చిల్కూర్ బాలాజీ దేవాలయం తరఫున కన్యా వందనంవంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రంగరాజన్ గుర్తు చేశారు. ఇందులో చంటి పిల్లల పాదాలకు భక్తిపూర్వకంగా పసుపు పూసి పారాణి రాసి అమ్మాయిలను గౌరవించే భావనని అలవాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే రక్షా బంధన్ కార్యక్రమాలతో సోదరీ సోదర భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని రంగరాజన్ చెప్పారు.
రేపాసురులకు ఉరి: ప్రతి పౌరుడూ జటాయువుగా మారాలి: చిల్కూర్ బాలాజీ ఆలయ అర్చకులు#Hyderabad, #Saidabad #CSRangarajan pic.twitter.com/XdXu8AvKyC
— oneindiatelugu (@oneindiatelugu) September 16, 2021












Click it and Unblock the Notifications