చినజీయర్ స్వామి సేఫ్.. అష్టలక్ష్మి ఆలయంలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : త్రిదండి చినజీయర్ స్వామి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దిల్‌షుఖ్‌నగర్ - ఎల్బీనగర్ రోడ్డులోని కొత్తపేటలో గల అష్టలక్ష్మి ఆలయంలో గోపురానికి పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.

భవన నిర్మాణంలో ఉపయోగించే గోవ కట్టె (కార్మికులు పైకి ఎక్కి దిగడానికి వీలుగా కర్రలతో ఏర్పాటు చేసుకునేది) మీద నిలబడిన సమయంలో.. అది ఒక్కసారిగా ఒరిగినట్లైంది. దీంతో పూజ సామాను తదితర వస్తువులు కిందకు జారిపడ్డాయి.
ఆ సమయంలో చినజీయర్ స్వామి తదితరులకు పట్టు దొరకడంతో ప్రమాదం తప్పినట్లైంది. మంగళవారం జరిగిన ఘటన గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చినజీయర్ స్వామి భక్తులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమీ కాలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.