అంతరాత్మ చెప్పిన వారికి ఓటేసాను-వారికే నా మద్దతు..చిరంజీవి : నమ్మకం ఉన్నవారికి ఓటేసాను..బాలక్రిష్ణ..!!
మా ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా సభ్యులు ఎవరిని గెలిపించుకుంటే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. తన అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేసానని చెప్పారు. తాను ఎవరికి ఓటు వేసానో ఎలా చెబుతానని ప్రశ్నించారు. ఎప్పుడూ ఒకే విధంగా పరిస్థితులు ఉండవని... పరిస్థితులు మారుతూ ఉంటాయన్నారు. ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా గెలుపు ఓటమిలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారికే
మా సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారికే తన మద్దతు ఉంటుందని చిరంజీవి తేల్చి చెప్పారు. ఇది ప్రత్యేకమైన పరిస్థి అని చెబుతూ..ఇలా జరగటం మంచిది కాదన్నారు. భవిష్యత్ లో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చిరంజీవి చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన చిరంజీవి అక్కడ ఎదురైన విష్ణుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. విష్ణు సైతం చిరంజీవిని పలకరించారు. భుజం పైన తట్టారు. అవకాశం ఉన్న ప్రతీ ఓటరు ఓటు వేస్తారంటూ చిరంజీవి చెప్పారు.

బాలయ్య ఆచి తూచి స్పందన
ఇక, అదే సమయంలో బాలక్రిష్ణ సైతం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పరిశ్రమకు మేలు చేస్తారనే నమ్మకం ఉన్న వారికి ఓటు వేసానని బాలక్రిష్ణ చెప్పారు. రెండు ప్యానల్స్ బాగానే పని చేస్తాయనే అభిప్రాయం కలుగుతోంది. ప్రకాశ్ రాజ్.. విష్ణు ఇద్దరూ అన్నదమ్ములు లాంటి వారేనని చెప్పారు. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత అందరూ కలిసే ఉంటారని స్పష్టం చేసారు. ఎవరు గెలిచినా..ఇండస్ట్రీ సభ్యుల సంక్షేమం ముఖ్యమని వ్యాఖ్యానించారు.

ఇద్దరూ బాగానే పని చేస్తారంటూ బాలయ్య
ఎవరి ఆశయాలు వారికి ఉన్నాయి. సినిమా పరిశ్రమలో వర్గాలు ఏమీ లేవని తేల్చి చెప్పారు. ఆహ్లాద కర వాతావరణంలోనే పోలింగ్ జరుగుతోందన్నారు. ఎవరు గెలిచినా ..ఆందరూ కలిసే పని చేస్తారని బాలయ్య చెప్పారు. ఇక, రాం చరణ్ అప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక, ఓటు వేసేందుకు వచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో కీలకంగా ఉన్న జీవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తాము లోపల ఉంటే ప్రచారం చేస్తున్నామని అంటున్నారని..నరేశ్ పోలింగ్ కేంద్రంలోని ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే 150 మంది ఓటు హక్కు వినియోగం
ఎవరు ఏం విమర్శించినా..వాటిని వారికే వదిలేస్తున్నామని చెప్పుకొచ్చారు. చివరి ఘట్టానికి వచ్చామని వ్యాఖ్యానించారు. మరో సినీ నటుడు సాయి కుమార్ సైతం స్పందించారు. ఓటు మన ఆయుధంగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కొందరు ఆవేశ పడ్డారన్నారు. తాను సైతం మా ఎన్నికల బరిలో నిలవాల్సి ఉందన్నారు. కమిట్ మెంట్స్ తో దూరంగా ఉన్నానని చెప్పారు, వ్యక్తిగత దూషణలు అనవసరని సూచించారు. డబ్బులు పంపిణీ సాధ్యం కాదంటూ సాయి కుమార్ తేల్చి చెప్పారు. ఇక, ఉదయం నుంచే పోలింగ్ ఊపందుకుంది. ఇప్పటి వరకు 150 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications