హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సీజేఐ ఓకే, హర్షం.. కేటీఆర్ థాంక్స్

|
Google Oneindia TeluguNews

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ ముగిసే చివరి రోజు కీలక తీర్పు వెలువరించారు. దాదాపు 8 వేల మంది జర్నలిస్టులను ఉద్దేశించిన హౌసింగ్ సొసైటీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ అంశంపై జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని పేర్కొన్నారు.

12 ఏళ్ల కింద..

12 ఏళ్ల కింద..


జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి మాట్లాడటం లేదు.. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలని ఆయన అడిగారు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం మని తెలిపారు. జర్నలిస్టులకు భూమి కేటాయించారని.. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. వారు స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని గుర్తుచేశారు. జర్నలిస్టుల స్థలాన్ని తిరిగి వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తున్నాం అని తెలిపారు. అక్కడ వారు నిర్మాణాలు కూడా చేసుకోవచ్చున్నారు.ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును మరో బెంచ్ ముందు లిస్టు చేయాలని కోరారు.

 జర్నలిస్టుల హర్షం

జర్నలిస్టుల హర్షం


జస్టిస్ ఎన్వీ రమణ తీర్పుపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్పుపై స్పందించారు. తెలంగాణ జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న ఈ కేసును పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు వల్ల పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

థాంక్స్

థాంక్స్


తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, సలహాదారులు క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ తెమ్జూ సయ్యద్ ఇస్మాయిల్ ,కార్యదర్శి రమణ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో గల ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వం కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
cji justice nv ramana agree to journalist lands. his last made sensational verdict on journalists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X