ఒక్క ఛాన్స్ మిస్ యూజ్.. జనంలో వ్యతిరేకత, జగన్‌పై చండ్ర నిప్పులు

ఏపీ సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరోసారి ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మూడేళ్లలోనే జనాలకు చుక్కలు చూపించారని ఆయన అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి చంద్రబాబు నివాళులు అర్పించారు. తర్వాత సీనియర్ నేతలతో ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. వారికి జనం ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని.. దానిని వారు సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు.

సీఎం జగన్ పై మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్సే.. లాస్ట్ ఛాన్స్ అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన.. జరుగుతోన్న పనిని జనం గమనిస్తున్నారని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ది చెబుతారని తెలిపారు. మైనింగ్, ఇసుకాసురులకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని వివరించారు.

cm jagan misuse for one chance:chandrababu

సీఎం జగన్ తన తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారని చంద్రబాబు ఆరోపించారు. మరో చెల్లి తన తండ్రి హత్య కేసు పరిష్కారానికి పోరాటం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుని ఉద్దేశించి వాపోయారు. వైసీపీ నేతల రౌడీయిజం, సెటిల్ మెంట్లపై పోరాడాలని తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాటం తప్పదని చెప్పారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.

జగన్ దగ్గర డబ్బు, అధికారం ఉంటే టీడీపీకి ప్రజాబలం ఉందన్నారు. ఆ బలంతోనే వారికి బుద్ది చెబుతామని పేర్కొన్నారు. అలాగే పార్టీలో నేతల గురించి ఒకింత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పని చేయని నాయకులను పార్టీ భరించాల్సిన అవసరం లేదని నేతలకు హెచ్చరించారు. త్వరలో ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ వంద జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+