హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాగంటి మానవ జాతికి దోరికిన మణిపూస : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటీ కోటేశ్వర్‌రావు ప్రవచనాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు కురిపించారు. ఆయన గొప్ప ప్రవచనకర్త అంటూ వ్యాఖ్యానించారు. చాగంటి మానవ జాతికి దొరికిన మణిపూస అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సీఎం కేసీఆర్, ఎన్టీఆర్‌ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటిని కేసీఆర్‌ శాలువాతో సన్మానించారు.

ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన ప్రవచనాలను గుర్తు చేసిన కేసిఆర్ తనకు కూడ భాగవత సప్తాహం వినాలని కోరిక ఉందని చెప్పారు. భగవంతుని గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్పారు.. గజేంద్రమోక్షం లాంటి ఘట్టాలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయని అన్నారు..ఇక భగవంతుని కరుణ మనకు కలగాలంటే లీనమై ప్రవచనాలు వినాలని చెప్పారు.

CM KCR attended to BHAGAVATA SAPTAHAM

చాగంటిని గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.. ఆధ్యాత్మికత అలవరచుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తాయని అన్నారు... రోజురోజుకు మానవ ప్రవృత్తి మారుతోందని, ఎక్కడకెళ్లినా రాని క్రమశిక్షణ గుడికెళ్తే వస్తుందని' కేసీఆర్‌ అన్నారు.

English summary
Telangana CM KCR attended to ''BHAGAVATA SAPTAHAM'' at LB stadium hyderabad. cm congratulates the Chaganti Koteshwar Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X