ప్రియాంక రెడ్డి పేరు మార్పు..నిందితులకు కఠిన శిక్ష పడాలి.... సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ షాద్‌నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతోపాటు త్వరత గతిన కేసు విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని ఆదేశాలను జారీ చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే మీడియా, సోషల్ మీడియాలో ప్రియాంకరెడ్డి పేరు వాడకుండా.. ఆమెను దిషాగా పిలువాలని, మాట్లాడాలని సీపీ సజ్జనార్ సూచించారు.
సీఎం కేసీఆర్ మాజాకా: వెటర్నరీ డాక్టర్‌కు న్యాయం చేయమని కోరుతుంటే.. పెళ్లిలో సారు బిజీ...

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రత్యేక చర్యలు
ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని న్యాయవ్యవస్థను సీఎం కోరారు. ఈనేపథ్యంలోనే వరంగల్‌లో చిన్నారీ ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సంఘటనలో కేవలం 56 రోజుల్లోనే తీర్పు వెలువడిందని సీఎం పేర్కోన్నారు. అదే విధంగా షాద్‌నగర్ హత్యాచారం కేసులో కూడ సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం భావించారు.... ఇక బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ మహళ ఉద్యోగులకు నైట్ షిప్ట్‌లు వద్దు..
ఇక అంతకుముందు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వారితో చర్చించిన సీఎం మహిళ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా ఆయన శంషాబాద్ సంఘటనపై తీవ్ర ఆవేదన చెందారు. మహిళ ఉద్యోగులకు రాత్రి విధులు వేయవద్దని చెప్పారు. మానవ మృగాలు మనమధ్య తిరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు.

సీఎంపై విరుచుకుపడుతున్న విపక్షాలు
కాగా ప్రియాంక రెడ్డి హత్యపై రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు, ప్రజా సంఘాలు రోడ్లమీద బైఠాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక రాజకీయ నాయకులు ప్రియాంక ఇంటికి క్యూ కట్టారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం సంఘటనపై ఎలాంటీ ప్రకటన చేయలేదు. బాధితురాలి కుటుంబానికి సానుభూతి కూడ వ్యక్తం చేయలేదు. దీంతో విపక్షాలు సీఎం తీరుపై మండిపడుతున్నారు. కనీసం సంఘటనను ఖండించడానికి కూడ సీఎం సమయం లేదా అంటూ విమర్శలు గుప్పించారు. మొత్తం సంఘటన జరిగిన 72 గంటల తర్వాత సీఎం స్పందిస్తూ... దోషులకు కఠినశిక్ష పడాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చట్టాలు కఠినంగా ఉండాలి... కేటీఆర్
మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం ప్రియాంక కేసును తానే స్యయంగా మానిటర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక చట్టాలను కూడ మార్చాల్సి ఉందని నేరుగా పీఎం నరేంద్రమోడీకి ట్వీట్టర్ ద్వార సందేశం పంపారు. నిందితులు చట్టాల నుండి తప్పించుకోకుండా జరుగుతున్న పార్లమెంట్‌లోనే చర్యలు చేపట్టాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడిని కోరారు. చట్టాలు మారుస్తే తప్ప సమాజంలో మార్పులు రావని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం వణికించిన... నిర్భయ హంతకులకు ఏడేళ్లయినా...శిక్షలు పడలేదని ఆయన మోడీని ప్రశ్నించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!