ఇదేమీ విచిత్రం.. అంతా హైదరాబాద్ వస్తే.. కేసీఆర్ మాత్రం ఢిల్లీకి.. సారూ ఏందిదీ..?
హైదరాబాద్ డెవలప్ చెందిన సిటీ.. ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే వైద్యపరంగా.. అన్నీ ఓకే.. వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్టులు ఉన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఫేమస్.. ఇక్కడికీ వివిధ రాష్ట్రాలకు చెందిన వారే.. విదేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. అంతా ఫేమస్ ఈ దవాఖాన.. ఇక ఏషియన్ ఇనిస్టూట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) కూడా అంతే ఫేమస్.. అవును ఆసియా ఖండంలోనే పెద్ద దవాఖాన ఇదీ. గ్యాస్ట్రిక్ సమస్యకు ఇక్కడ ఉపశమనం లభిస్తోంది. కానీ మన సీఎం కేసీఆర్ సారూ.. మాత్రం వెరైటీ.. అవును తన కంటికి, పంటి చికిత్స కోసం కూడా హస్తిన వెళుతున్నారు. విషయం తెలిసి ఇతరులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆరోగ్య రాజధానే.. కానీ
హైదరాబాద్ ఆరోగ్య రాజధాని.. ఎందుకంటే ఇక్కడ అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులు అందుబాటులో ఉన్నారు. కంటికి ఎల్వీ ప్రసాద్.. కడుపునకు ఏషియన్.. గుండెకు కేర్, అపోలో, స్టార్.. ఒక్కో విభాగంలో స్పెషల్ యశోదా.. మరికొన్ని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి వైద్య చికిత్స కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే అందరు హైదరాబాద్ వస్తున్నారు. శ్రీలంక వంటి దేశాల నుంచి ఎయిర్ అంబులెన్స్‌ల్లో వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేస్తున్నారు. అంత ఎందుకు ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ రెండు సార్లు తన కుమారుడిని తీసుకొచ్చి మరీ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించారు.

కేసీఆర్ హస్తిన బాట
దేశ, విదేశాల నుంచి వైద్య చికిత్సల కోసం హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అస్వస్థతకు గురయినా సీఎం కేసీఆర్ హస్తినకు వెళుతున్నారు. కంటి పరీక్షలైనా.. పంటి పరీక్షలైనా ఢిల్లీలో చేసుకుంటున్నారు. ఆరోగ్య రాజధానిగా అత్యాధునిక సేవలు అందిస్తున్న హైదరాబాద్ కాదని.. వైద్య చికిత్సలకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. అంతా హైదరాబాద్ వస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం హస్తినకు వెళ్లడం ఏమిటనే ప్రశ్న వస్తున్నాయి.

గతంలో వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు సతీసమేతంగా
కంటి శస్త్ర చికిత్స కోసం గతంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. శస్త్ర చికిత్స కూడా అక్కడే చేయించుకున్నారు. అప్పట్లో హైదరాబాద్‌ను వదిలి ఢిల్లీకి వెళ్లడం ఏమిటనే విమర్శలు వచ్చాయి. తన సతీమణి శోభను కూడా వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికే తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం మరోమారు వైద్య పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఆయన పన్ను తీయించుకున్నారని తెలిసింది. హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పేరుగాంచిన స్పెషలిస్టు వైద్యులు మన వద్ద ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికే వచ్చి వైద్య చికిత్స చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అలా కాదు.. తనకు హస్తినే ముఖ్యం అని అంటున్నారు. చెప్పే మాటలు ఇక్కడివీ.. తన వైద్యం కోసం మాత్రం ఢిల్లీ బాట పడుతున్నారు.












Click it and Unblock the Notifications