హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధాన్యం సేకరణపై ఆరా.. వానకాలం పంటపై చర్చ.. మంత్రులతో సీఎం కేసీఆర్ డిస్కషన్

|
Google Oneindia TeluguNews

యాసంగి పంట కొనుగోలు చేస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముడి బియ్యాన్నే ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. 40 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్రం నిన్న రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. జిల్లాల్లో ధాన్యం సేకరణపై తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. వచ్చే వానకాలం సీజన్ సన్నద్ధతపై చర్చిస్తున్నారు. దళితబంధు పథకం అమలు తీరుతెన్నులపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.

cm kcr meets minister and officials

రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష కొనసాగుతోంది. వ‌ర్షాకాలం సాగు కోసం వ్య‌వ‌సాయ శాఖ స‌న్న‌ద్ధ‌త‌పై కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల‌ను కూడా సీఎం డిస్కష్ చేస్తున్నారు. వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు గురించి కూడా సమావేశంలో చర్చకు రానుంది. పంట కోసం విత్తనాలు, యూరియ గురించి కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.

యాసంగి పంట కొనుగోలు చేస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఇటు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా చేస్తున్నారు. నిన్న యాత్రలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా.. ఇరు పార్టీలు తెగ హడావిడి చేస్తున్నారు. కానీ కేసీఆర్ ముందస్తుకు వెళతారని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. అదేం లేదని నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని అధికార పార్టీ చెబుతుంది.

English summary
telangana cm kcr meets minister and officials. they discuss yasangi crop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X