హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌ను గద్దె దించేందుకు.. ఈటల బీజేపీలో చేరికపై..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక లాంఛనమే కానుంది. ఆయన ఢిల్లీ పర్యటన కూడా అందుకేనని తెలుస్తోంది. హస్తిన పెద్దలతో భేటీ తర్వాత.. కమల దళంలో ఈటల రాజేందర్ చేరబోతున్నారు. ఈ అంశంపై ఇన్నాళ్లూ స్పందించని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక అంశాన్ని.. పెద్దిరెడ్డి అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. అన్నీ కామనే.. అవే సర్దుకుంటాయని చెప్పారు. తమపై బురద జల్లడమే టీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విరుచుకుపడ్డారు.

జేపీ నడ్డాతో ఈటల భేటీ

జేపీ నడ్డాతో ఈటల భేటీ


బీజేపీలో ఈటల రాజేందర్ చేరడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఈ విషయం తనతో చర్చించిన తర్వాతే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్ళారని పేర్కొన్నారు.

అసంతృప్తి సహజమే..

అసంతృప్తి సహజమే..

ఈటల రాజేందర్ బీజేపీలో చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. ఇప్పుడు పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. అసంతృప్తులు సహజమని, సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తామన్నారు. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రానా తాను స్పందించాల్సి‌న అవసరం లేదన్నారు. కేసీఆర్‌కు మంచిని.. మోడీకి చెడును ఆపాదించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

Recommended Video

Chandrababu Naidu ఐనా KissMiss Naidu ఐనా వదలను - Kodali Nani
కమలం గూటికే..?

కమలం గూటికే..?

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. తొలుత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీ నేతలతో కూడా విసృత సంప్రదింపులు జరిపారు. మరోవైపు సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈటల రాజేందర్ మాత్రం.. కమలం గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

English summary
telangana cm kcr must be step down central minister kishan reddy alleged. today etela rajender will meet bjp chief jp nadda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X