• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం: ఆర్టీసీకి జేఏసీకి ఉద్యోగులు మద్దతు లేకుండా..! ఉప ఎన్నిక తరువాత వరాలే..!

|

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె మీద సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి ఆ విషయంలో వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు. సమ్మె కొనసాగుతుండగానే ప్రజల కు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్న ఆర్టీసీ జేఏసీ తెలంగాణలోని ఉద్యోగ..ఉపాధ్యాయ సంఘాల మద్దతు సైతం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి..వ్యతిరేక పెరుగుతుందని గ్రహించిన సీఎం కేసీఆర్ వెంటనే వేగంగా అడుగులు వేసారు. టీఎన్జీవో..టీజీవో సంఘా నేతలకు ఆహ్వానం పంపారు. వారికి రావాల్సిన పీఆర్సీ పైన చర్చలు చేసారు. ఆర్దిక పరిస్థితుల కారణంగా పీఆర్సీ ఆలస్యమైందని..త్వరలోనే ఐఆర్ ఇస్తామని ప్రకటించారు. ఉప ఎన్నికల కోడ్ కారణంగా తక్షణమే ఏమీ చేయలేమని..ఎన్నిక ముగిసిన తరువాత అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?

సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం..

సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం..

ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంతో సై అంటే సై అంటూ సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల మద్దతు సంపాదించారు. సహజంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంఘాలకు మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల మద్దతు పొందేందుకు ఆర్టీసీ సంఘాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అదే జరిగితే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని గ్రహించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమావేవమయ్యారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని..అదే సమయంలో ఆర్టీసీ ఇబ్బందులను వారికి వివరించారు. ప్రభుత్వం ఆర్టీసీ కోసం ఏం చేసిందీ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో సమ్మె చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పినట్లు సమాచారం.

ఉద్యోగుల పీఆర్సీపైనా చర్చ..

ఉద్యోగుల పీఆర్సీపైనా చర్చ..

ఉద్యోగులతో సమావేశ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలనే భావనతో ఉన్నా.. ఆర్దిక మాంధ్యం ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో.. ఐఆర్ కాకుండా నేరుగా పీఆర్సీనే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేసారు. పీఆర్సీ సిఫార్సులను అధ్యయనం చేసి..సాద్యమైనంత త్వరలో అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అయితే, ఇప్పటికే ఆలస్యం కారణంగా ఉద్యోగులు నష్టపోయారంటూ సంఘాల నేతలు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో.. తాను త్వరలోనే దీని పైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న డీఏ 3.44 శాతం చెల్లింపుకు సిద్దమని చెప్పారు. అయితే, అన్ని అంశాలకు ఉప ఎన్నిక తరువాత పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొచ్చారు.

ఆర్టీసీ విషయంలో కఠినంగానే..

ఆర్టీసీ విషయంలో కఠినంగానే..

ముఖ్యమంత్రి వైఖరి గమనిస్తే ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించినట్లుగా స్పష్టం అవుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని సీఎం అంటున్నట్లు సమాచారం. పండుగల సమయంలో ప్రభుత్వం..సంస్థ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా సమ్మె చేయటం సరి కాదనే భావనలో సీఎం ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కార్మికులు సమ్మె చేసినా..సాధారణ ప్రజల మీద ఎటువంటి ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఉద్యోగుల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వానికి సమాచారం లేకుండా తిరిగి ఎక్కడా విధుల్లోకి తీసుకోవద్దంటూ స్పష్టం చేసారు.

English summary
CM KCR new strtegy to avoid state govt employees support for RTC employees called TNGO's and explained about state financial postion.Assured for implementation of PRC and othet benefits after by poll
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more