హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల కొత్త పార్టీ: సీఎం కేసీఆర్ రియాక్షన్.. అంత ఈజీ కాదంటూ..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారనే రూమర్లు వచ్చాయి. అయితే ఆమె పార్టీపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ పార్టీకి సంబంధించి ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయం జనం కూడా మరచిపోయారు. అయితే నిన్న జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల పార్టీ గురించి వ్యాఖ్యలు చేశారు.

షర్మిల పేరు ప్రస్తావించకుండా..

షర్మిల పేరు ప్రస్తావించకుండా..

నిన్నటి సమావేశంలో కేసీఆర్ పార్టీ ఆవిర్భావం గురించి కామెంట్ చేశారు. అయితే ఎవరూ పార్టీ పెడతారనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కానీ షర్మిల పేరు మాత్రం బయటకు రాలేదు. కానీ అందరూ మాత్రం షర్మిల గురించి పరోక్షంగా కామెంట్ చేశారని అనుకుంటున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? అని కేసీఆర్ అన్నట్టు సమాచారం.

నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్

నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్

అలే నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా అని కేసీఆర్ గుర్తుచేశారు. నాలుగు రోజుల్లోన తోక ముడుస్తారని.. ఎటూకాకుండా తెరమరుగై పోతారని వ్యాఖ్యానించారు. 1985లో టీడీపీ నుంచి తాను సిద్దిపేట, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచామని కేసీఆర్ తెలిపారు. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులతో కలిసి రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్‌ పార్టీలో చేరారని చెప్పారు.

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
 టికెట్ కూడా రాలే

టికెట్ కూడా రాలే

ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్‌ కూడా రాలేదని చెప్పారు. దాంతో ఆయన తెరమరుగయ్యారని కేసీఆర్ వివరించారు. రామచంద్రారెడ్డి కోసం సిద్ధిపేటలో ఇటీవల తానే ఇంటి స్థలం ఇప్పించానని పేర్కొన్నారు. నిర్మాణానికి ఆర్థికసాయం కూడా చేశానని చెప్పారు. రాంగ్‌ ట్రాక్‌లో వెళితే ఇలాగే ఉంటుందని తెలిపారు. రామచంద్రారెడ్డి మంచివాడైనా ఫలితం లేకుండా పోయిందన్నారు. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని కేసీఆర్ అన్నారు. ఈ కామెంట్లు షర్మిలకు వర్తిస్తాయని అందరూ అనుకుంటున్నారు.

English summary
telangana chief minister kcr reacts on ys sharmila new party issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X