హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూములు అమ్మే ఆశ చావదు, సీఎం కేసీఆర్‌పై షర్మిల హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కి భూములు అమ్మే ఆశ చావదని ఫైరయ్యారు. పైసల మీద దాహం చావదని హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద భూములు అమ్మినా కేసీఆర్ వృథా ఖర్చుకు హద్దు లేదన్నారు. ఇటీవల కోకాపేట, ఖానామెట్ భూములను విక్రయించగా భారీగా నగదు సమకూరిన సంగతి తెలిసిందే.

కల్వకుంట్ల భూములా..?

కల్వకుంట్ల భూములా..?

'అమ్మే భూములు తెలంగాణ ప్రజల భూములా? కల్వకుంట్ల వారి భూములా?' అని షర్మిల ప్రశ్నించారు. భూములు అమ్మిన పైసలు హుజూరాబాద్ కోసం.. మేఘా కంపెనీ బకాయిల చెల్లింపు కోసం వినియోగిస్తుందన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములకు కేర్ టేకర్‌గా ఉండాల్సిన సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నాడని షర్మిల విమర్శించారు.

2 వేల కోట్ల ఆదాయం..

2 వేల కోట్ల ఆదాయం..

కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్‌ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి అంతకన్నా ఎక్కువ స్పందన లభించింది. ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన వేలంలో అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్‌గా ఎకరం ధర 48.92 కోట్లుగా వచ్చింది. రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేయగా.. రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలను జీవీపీఆర్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఇక, రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ సొంతం చేసుకోగా.. రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలను అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ కొనేసింది. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను కూడా తన ఖాతాలో లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ వేసుకుంది.

ఖానామెట్ భూములు..

ఖానామెట్ భూములు..


కోకాపేట భూముల కంటే.. ఖానామెట్ భూములు ఎక్కువ ధర పలికాయి. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలికింది.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికింది.. కానీ, అదే ఖానామెట్‌ భూముల విషయానికి వస్తే.. గరిష్టంగా రూ.55 కోట్ల ధర పలికినా.. అవరేజ్‌గా మాత్రం 48.92 కోట్లు వెచ్చించారు. దీంతో.. కోకాపేట కంటే ఖానామెట్‌లోనే కాసుల వర్షం కురిసిందన్నమాట.. మొత్తంగా.. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో రూ.2729 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

షర్మిల పైర్

షర్మిల పైర్

కోకాపేట, ఖానామెట్ భూములను ప్రభుత్వం విక్రయించింది. దీనిని వైఎష్ షర్మిల ప్రశ్నించారు. భూములను అమ్ముకుంటూ పోతే ఎలా అని అడిగారు. ఆదాయం కోసం భూములను విక్రయించాల్సిందేనా అని కోరారు.

English summary
ysrtp president ys sharmila slams cm kcr on land sale issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X