అందుకే యాసంగి కిరికిరి షురూ.. కేసీఆర్‌పై షర్మిల విమర్శలు
సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి నిప్పలు చెరిగారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులు చనిపోతున్నా తమకు రాజకీయాలే ముఖ్యమని రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని షర్మిల మండిపడ్డారు. యాసంగి వడ్లు కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడం పట్ల ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. రాష్ట్రంలో చివరి గింజ వరకూ కొంటామని మొన్నటివరకు చెప్పిన కేసీఆర్, కేంద్రంతో పంచాయితీ మొదలు కాగానే యాసంగి కిరికిరి షురూ చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ నాటకాలు..
కేంద్రం వడ్లు కొనడం లేదని చెప్పి, కేంద్రంపై నెపం మోపి నాటకాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం... మోడీని తరిమేస్తాం అని చెప్పే కేసీఆర్.. కేంద్రం నుంచి వడ్లు కొనిపించడం చేతకాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించాలని సవాల్ విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

రుణమాఫీ ఏదీ..?
రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు పట్టడం లేదని, రైతు చనిపోతున్నా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సర్కారు హామీ ఇచ్చిన రుణమాఫీ పత్తా లేకుండా పోయిందన్నారు. మంత్రులు తిరిగి పంటలు పరిశీలించారే తప్ప ఇప్పటివరకూ నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌కు భజన చేస్తున్న మంత్రులు.. నష్టపరిహారం పట్ల కేసీఆర్‌కు అడగడం మాత్రం చేతకావడం లేదన్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వక, ఆదుకునే నాయకుడు లేక రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారన్నారు.

ఇక బంగారు దేశం
ఏ దిక్కూ లేక దేవుడే దిక్కూ అంటూ రైతులు బలవన్మరణానికి పాల్పడుతుంటే.. స్పందించాల్సిన ప్రభుత్వం.. చనిపోతే తమకేంటనే ధోరణిలో ఉందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేశామని, ఇక బంగారు భారతదేశం చేస్తామని రైతు శవాల మీది నుంచే కేసీఆర్ దొర దేశం బయలుదేరుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? అని ఆమె మండిపడ్డారు. కేసీఆర్‌ది రైతు సంక్షేమ ప్రభుత్వమే అయితే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ తప్పుడు హామీలతో రైతులను మోసం చేస్తున్నారని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications