జగన్, కేసీఆర్ దొందూ దొందే: రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ నైజాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఉద్యమకారులంతా కేసీఆర్ చేత అణిచివేయబడ్డారని గుర్తుచేశారు. ప్రతిపక్షాల హక్కులను కూడా లాక్కుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి విముక్తి కోసం తుది దశ పోరాటానికి సమయం ఆసన్నైందన్నారు. ఏ పదవి లేకున్నా ..పోరాటానికి తాను సిద్ధమని ప్రకటించారు. టీజేఎస్ అధినేత కోదండరామ్.. రాజకీయాలకు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు ఆయన లాగే ఉంటాడని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
Recommended Video
కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణ ఎత్తిపోసుకుంటున్నది ఒక్క టీఎంసీ మాత్రమేనని రేవంత్ వివరించారు. కానీ ఏపీ మాత్రం 12 టీఎంసీలు ఎత్తిపోసుకునే పనులు చేస్తోందన్నారు. పాత విద్యుత్ ప్రాజెక్టులను చంపి కొత్తవి కట్టాలని ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ కారులను తరిమి కొట్టిన తలసాని శ్రీనివాస్‌కు మంత్రి పదవి, అతని కొడుక్కి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను గద్దె దించితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి మారదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications