బండిపై వీహెచ్ విసుర్లు.. భాగ్యలక్ష్మీ అమ్మవారి గురించి అలా..
తెలంగాణ రాష్ట్రంలో మండు వేసవిలో కూడా రాజకీయ వేడి రంజుగా సాగుతుంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఎవరికీ వారు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు వంతు వచ్చింది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విమర్శలు చేశారు.

బండిపై ఫైర్
బండి సంజయ్‌పై వి హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్‌లో గల భాగ్యలక్ష్మి అమ్మ వారి గుడిపై ఎవరూ చెయ్యి వేయరని అన్నారు. అమ్మవారిని తాము కూడా కొలుస్తామని చెప్పారు. చార్మినార్ వద్ద ముస్లింలు నమాజ్ చేస్తారని, అదే ప్రాంతంలో హిందువులు భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కుతారని వీహెచ్ అన్నారు.

అలా ఏం లేదే..
చార్మినార్ వద్ద ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ స్థానిక నేత రషీద్ ఖాన్ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో తమకు తెలియదన్నారు. ఈ అంశంపై పార్టీలో చర్చించి తెలుసుకుంటామని వివరించారు. తమ పార్టీ వాళ్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని వీహెచ్ అన్నారు. ఇలాంటివీ సాధారణంగా ఎంఐఎం చేస్తుందని, ఈ కుట్ర వెనక వారి హస్తం ఉందేమోనని అనుమానంగా ఉందన్నారు.
Recommended Video


మ్యాచ్ ఫిక్సింగ్
బీజేపీ, ఎంఐఎం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఎవరయిన తమ పరిధిలో హుందగా ప్రవర్తించాలని కోరారు. కానీ రెచ్చగొట్టేలా కామెంట్ చేయడం సరికాదని సూచించారు. నేతలు మిగతావారికి ఆదర్శంగా నిలవాలే తప్ప.. ప్రశ్నించే మాదిరిగా ఉండొద్దని కోరారు.












Click it and Unblock the Notifications