హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా విజృంభిస్తోంది.!శుభ్రత ఒక్కటే పరిష్కారం.!అధికారులను అప్రమత్తం చేస్తున్న మేయర్ విజయలక్ష్మి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో బాగంగా కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ లలో జరుగుతున్న పారిశుద్ధ్య మరియు డంపింగ్ యార్డ్ ల పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు. ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటల వరకు, రాత్రి 8గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు 6జోన్లలో రెండు దశల్లో అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని మేయర్ విజయ లక్ష్మి ఆదేశాలు జారీ చేసారు.

హైదరాబాద్ క్లీన్ గా ఉండాలి..

హైదరాబాద్ క్లీన్ గా ఉండాలి..

దీంతో పాటు కూకట్ పల్లి జోన్ లోని బాలాజీనగర్ డివిజన్ లోన కైతలపూర్ డంపింగ్ యార్డ్ మరియు జగద్గిరిగుట్ట డివిజన్ లోని హెచ్ఏంటీ కాలనీ పైప్ లేన్ రోడ్డు లోని డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ కైత్లాపూర్ డంపింగ్ యార్డ్ కు వెళ్ళే రోడ్డు లో దాదాపు కిలోమీటర్ వరకు అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దాని వల్ల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని అన్నారు. కాంట్రాక్ట్ కి ఇచ్చిన వాటిని చూసుకునే బాద్యత సంబందిత అధికారులదేనని మేయర్ స్పష్టం. అక్కడ ఉన్న సీటీపి ప్లాంట్ సామర్థ్యాన్నిపెంచాలని అదికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేసారు.

నగరంలోని శేరిలింగం పల్లి జోన్లో తనిఖీలు..

నగరంలోని శేరిలింగం పల్లి జోన్లో తనిఖీలు..

ఆ తరువాత అక్కడ డ్రైనేజ్ సమస్యలు మరియు రోడ్డు సమస్యలు తన దృష్టికి రాగా మేయర్ వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. త్వరలోనే అన్నీ డంపింగ్ యార్డ్ ల వద్ద బయట చెత్త పడనియకుండా చూస్తామని మేయర్ అన్నారు. డివిజన్ లలోని పలు సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చిన జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్, సూరారం కార్పొరేటర్ సత్యనారాయణ, గాజులరామారం కార్పొరేటర్ శేషగిరి తన దృష్టికి తీసుకురాగా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా ప్రశాంత్ నగర్, శ్రీహరి నగర్, పవర్ నగర్ విజ్ఞాన పూరీ కాలనీ, ధరనేని కాలనీ, సాయిబాబా నగర్, ప్రకాష్ నగర్, పాపారాయుడు నగర్, దేనబందు కాలనీ, దేవం బస్తీ లలో పారిశుద్ధ్య పనులను మేయర్ పరిశీలించారు.

 చెత్త తరలించే వాహనాలు పెంచండి..

చెత్త తరలించే వాహనాలు పెంచండి..

అంతే కాకుండా శేరి లింగంపల్లి జోన్ లోని పటాన్ చెరువు , ఆర్ సీ పురం డివిజన్ లలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ విజయ లక్ష్మి పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా లో ఉన్న సీటీపి ప్లాంట్ ను పరిశీలించారు. పటాన్ చెరువు కార్పొరేటర్ కుమార్ యాదవ్ సీటీపి ప్లాంట్ వద్ద ఆటో కార్మికులకు టాయిలెట్ సౌకర్యం మరియు 5రూపాయల భోజన సదుపాయం, నీళ్ళ సదుపాయం, ఒక షెడ్ కట్టించాలని కోరగా మేయర్ వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత ఈ మద్యనే పటాన్ చెరువు లో కలిసిన బండ్లగూడ గ్రామంలో లో సీటీపి ప్లాంట్ ఏర్పాటు మరియు ఆటో రిక్షాల పెంపు, అలాగే పటాన్ చెరువు బస్ స్టాండ్ వద్ద రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు కట్టించాలని కార్పొరేటర్ మేయర్ విజయ లక్ష్మిని కోరారు. జోనల్ కమిషనర్ రవికిరణ్ తో మాట్లాడి ఏర్పాటు చేయాలని మేయర్ కోరారు .

క్లీన్ సిటీ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు..

క్లీన్ సిటీ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు..

పటాన్ చెరువు మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన మేయర్ విజయ లక్ష్మి 14 ఎకరాల్లో కట్టిన మార్కెట్ యార్డ్ చాలా బాగుందని అభినందించారు. మొత్తం మార్కెట్ యార్డ్ పారిశుద్యం చేయించాలని మేయర్ ఆదేశాలు జారీ చాసారు. తరువాత డీఆర్ఎఫ్ టీం కూకట్ పల్లిలో చల్లుతున్న సోడియం హైపో క్లోరైడ్ పనులను పరిశీలించారు . నగర ప్రజలు దయచేసి ఎక్కడ కూడా చెత్త రోడ్డు మీద వేయకూడదని, చెత్త తీసుకెళ్లే ఆటోలలో మాత్రమే వేయాలని మేయర్ సూచించారు. త్వరలోనే జీహెచ్ఎంసీ కీలక సమావేశంలో నగర పారిశుద్యం మెరుగుపరిచేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని మేయర్ విజయ లక్ష్మి స్పష్టం చేసారు.

English summary
Part of a special sanitation drive in the city, Mayor Gadwal Vijayalakshmi inspected the sanitation work in Sherilingam Pally and Kukat pally Zones. The mayor has issued orders for authorities to be vigilant at the moment the corona is booming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X