హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ చేరిన 3.72 లక్షల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు చేరుకుంటున్నాయి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు డోసులు రీచవుతున్నాయి. కాసేపటి క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నారు. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్‌తో బయలుదేరిన విమానం శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యింది.

301 మందికి కరోనా.. ఇద్దరు మృతి... 3 లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు301 మందికి కరోనా.. ఇద్దరు మృతి... 3 లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు

మొత్తం 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ బాక్సులను కోఠిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలిస్తున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో వీటిని తరలిస్తున్నారు. వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్లను అందుబాటులో ఉంచారు. ఇక్కడినుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలిస్తారు. తొలి విడతగా 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందజేస్తారు.

corona virus vaccine reached hyderabad

సీరం ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం అనే సంగతి తెలిసిందే. దేశంలో ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. జూలై నాటికి సరిపడ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అధర్ సిన్హా ఇదివరకే ప్రకటించారు. ఇటు ఏపీకి కూడా 4.7 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు రానున్నాయి. అక్కడ నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతామని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
corona virus covishield vaccine reached hyderabad. 31 boxes 3.72 lakh doses vaccine are there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X