హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. సిటీలో ఊహించని మార్పులు?.. ఒక్కరోజే గడువు..

|
Google Oneindia TeluguNews

ఒకవైపు కరోనా సోకుతుందేమోననే భయం.. మరోవైపు బయటికి వెళ్లకుంటే ఇల్లుగడవదనే ఆందోళన.. కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. గంటగంటకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య.. ఆఫీసులో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయని మొత్తం బిల్డింగ్ నే ఖాళీ చేయిన దృశ్యాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. వీటి నేపథ్యంలో విశ్వనగరం హైదరాబాద్ లో సామాన్యుడి పరిస్థితి గందరగోళంగా తయారరైంది. హైకోర్టు కూడా సరిగ్గా ఇదే అంశాన్ని పాయింటవుట్ చేసింది.

తొలిసారి కరోనాపై ఆదేశాలు..

తొలిసారి కరోనాపై ఆదేశాలు..

సామాన్యుడి కోణంలో ప్రభుత్వం.. కరోనాకు సంబంధించి చేపట్టిన అన్ని చర్యలకు సంబంధించిన సమగ్ర రిపోర్టును తన ముందుంచాలని కోర్టు పేర్కొంది. దాందోపాటు వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీచేసింది. సామూహిక వేడుకలా జరుపుకునే హోలీ పండుగపై ఆంక్షలు విధించాలని కోరుతూ కొడాపూర్‌కు చెందిన ఓ మహిళ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు బుధవారం విచారించింది. దేశంలోనే తొలిసారి కరోనాపై ఆదేశాలిచ్చిన సందర్భం ఇదే కావడం గమనార్హం.

కక్షిదారులు కోర్టుకు రావొద్దు..

కక్షిదారులు కోర్టుకు రావొద్దు..

కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన అన్ని చర్యల్ని వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. ఇప్పటిదాకా ఏమేం చేశారో ఆ వివరాల్ని రిపోర్టు రూపంలో గురువారంలోగా అందజేయాలని డెడ్ లైన్ విదించింది. వైరస్ భయాల నేపథ్యంలో కక్షిదారులెవరూ కోర్టుకు రావొద్దంటూ అనూహ్య ఆదేశాలిచ్చింది. ‘‘రేపటి నుంచి కోర్టులో గుంపులు గుంపులుగా జనం కనపడటానికి వీల్లేదు. కక్షిదారులెవరూ కోర్టుకు రానవసరంలేదు. ఈ విషయాన్ని లాయర్లే తమ క్లయింట్లకు తెలియపర్చాలి''అని జడ్జిలు పేర్కొన్నారు.

లాయర్లందరూ విధిగా మాస్కులు..

లాయర్లందరూ విధిగా మాస్కులు..


కక్షిదారుల్ని కోర్టుకు రావొద్దన్న జడ్జిలు.. లాయర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ మేరకు రేపటిలోగా అందరికీ మాస్కులు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సిటీలో మాస్కుల కొరత ఏర్పడిందనే వార్తలపై జడ్జిలు ఆరా తీయగా.. హోల్ సేల్ మార్కెట్ లో కావాల్సినన్ని మాస్కులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాగే..

సిటీలో ఈవెంట్లు వద్దు..

సిటీలో ఈవెంట్లు వద్దు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో బహిరంగ సభలు లేదా భారీగా జనం పోగయ్యే ఈవెంట్లకు అనుమతిపై పోలీసులు ఒకటికి రెండుసార్లు పునరాలోచన చేయాలని కోర్టు సూచించింది. సమూహాలకు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు, ప్రభుత్వం కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో సిటీలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఆదేశాలు..

రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఆదేశాలు..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకులకు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని స్కూళ్లు, కాలేజీల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని, సబ్బుతో చేతు కడుక్కోవడం, సమూహాలకు దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు తప్పనిసరిగా రుమాలు వాడటం లాంటి జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జనం బెంబేలు..

తెలుగు రాష్ట్రాల్లో జనం బెంబేలు..

తెలంగాణలో ఇప్పటిదాకా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైనప్పటికీ.. వైరస్ వ్యాప్తి భయంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రహేజా ఐటీ పార్కులో భవంతి ఖాళీ చేయించిన తర్వాత చాలా మంది టెకీలు టెస్టుల కోసం గాంధీ ఆస్పత్రికి పరుగులు తీశారు. ఏపీలో బుధవారం నాటికి నలుగురు అనుమానితులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

English summary
for the first time telangana high court gave key orders on coronavirus. hearing a pil on wednesday, court says, only advocates will be allowed into court and asked govt report on preventive measures
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X