హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నడిరోడ్డులో జంటపై దాడి కేసులో ట్విస్ట్ ... చంపడానికి ప్రయత్నించింది బంధువులే ....

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగర నడిబొడ్డున ... ఎస్ఆర్ నగర్‌లో రాత్రి వాహనంపై వెళ్తున్న జంటపై దాడికి తెగబడ్డ కేసును పోలీసులు చేధించారు. కపుల్‌పై దాడి చేసింది బంధువులేనని విచారణలో వెలుగుచూసింది. తమ ఇంటికి వస్తూ .. ప్రేమగా పిలుస్తూ కూతురును పెళ్లిచేసుకోవడంతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరో పంథాను ఎంచుకున్న కాంగ్రెస్ ...సీఎల్పీపై విలీనంపై ఉదృత పోరాటం.. మరో పంథాను ఎంచుకున్న కాంగ్రెస్ ...సీఎల్పీపై విలీనంపై ఉదృత పోరాటం..

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

బోరబండకు చెందిన సయ్యద్ మోసిన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురు సయ్యద్ బేబాకు పెళ్లి కాగా .. ఫాతిమాకు ఇటీవలే సంబంధం కుదిరింది. సౌదీ అరేబియాలో మసీదులో ఇమామ్‌గా పనిచేసే వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. తమకు మంచి సంబంధం దొరికిందని .. ఆ కుటుంబం ఆనంద డోలికల్లో తేలియాడింది. కానీ వారి ఆశలను అడియాసలు చేసింది ఫాతిమా. తన ఇంటికి వచ్చి .. చెల్లి అని పిలిచే దూరపు బంధువు షేక్ ఇంతియాజ్‌తో ప్రేమాయణం సాగించింది. వారిద్దరికీ ఇష్టం ఉండటంతో ఇటీవల వారు లేచిపోయి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమకు కుటుంబసభ్యుల నుంచి ముప్పు ఉంటుందని భావించి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించి భద్రత కల్పించాలని కోరిన వెంటనే ఫాతిమా కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. అచ్చం సినిమా సీన్లను తలపించేలా సాగింది ఫాతిమా లవ్ స్టోరీ.

రగిలిపోయారు ..

రగిలిపోయారు ..

షేక్ ఇంతియాజ్‌తో ఫాతిమా ప్రేమ, పెళ్లి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఫాతిమా సోదరుడు సయ్యద్ కోపంతో రగిలిపోయాడు. దీనికి కారణమైన ఇంతియాజ్‌ను మట్టుబెట్టాలని వ్యుహరచన చేశాడు. కిరాయి హంతకులు రబ్బానీ, షకీలు సాయం తీసుకొని .. సంగారెడ్డిలో ఉన్న జంటను హైదరాబాద్ పిలిపించారు. అయితే హత్య కోసం ఉపయోగించిన కత్తి అంత పదునుగా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లేదంటే ఇంతియాజ్ చనిపోయేవారు. దాడి తర్వాత నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలోని షాహిత్ నగర్‌లో నిందితులను పట్టుకున్నారు.

తల్లి కూడా కత్తి పట్టింది ...

తల్లి కూడా కత్తి పట్టింది ...

ఫాతిమాపై దాడి చేసిన వారిలో తల్లి కూడా ఉండటం గమనార్హం. తండ్రి సయ్యద్ మోసిన్ అలీ, షాకీర్ బేగం, సోదరులు సయ్యద్ ఫారూక్ అలీ, సయ్యద్ అహ్మద్ అలీ, సోదరి సయ్యద్ బేబా ఫాతిమా, బావ సయ్యద్ మహ్మద్ అలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాయి నేరస్తులు రబ్బానీ, షకీల్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

నెక్ట్స్ రౌడీ షీటే ?

నెక్ట్స్ రౌడీ షీటే ?

ఫాతిమా దంపతులపై దాడిచేసిన ఆరుగురిపై హిస్టరీ షీట్లను తెరుస్తున్నామని డీసీపీ తెలిపారు. వీరు మరోసారి నేరం చేసే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరించారు. రక్షణ కల్పించాలని కోరిన ఇంతియాజ్‌కు ప్రొటెక్షన్ ఇస్తామని స్పష్టంచేశారు. మరోవైపు నిమ్స్‌లో చికిత్స పొందుతన్న ఇంతియాజ్ కోలుకుంటున్నాడు. అతని చెవికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ముఖ్యంపై కత్తి గాయాలకు చికత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని .. నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు పేర్కొన్నారు.

English summary
Syed Mohsin of Borabanda is with his family. He has a wife, two sons and two daughters. A daughter is married to Syed Baba and Fatima has recently been in a relationship. There was also engagement with the person who worked as an imam in the mosque in Saudi Arabia. We have got a good relationship .. The family floats in pleasures. But their hopes were made by Fatima. She came to her house and loved her with a distant relative Imtiyaz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X