ఎంత పనిచేశావ్ తల్లీ.. చిన్ని వినలేదని, నువ్వు ఊపిరి తీసుకుంటావా..
ఇప్పుడు ట్రెండ్ వేరు. సొసైటీలో పలు మార్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఒకప్పటిలా లేదు. అంటే ప్రేమ, అభిమానం, అప్యాయత, అనురాగం అనేవి తక్కువ.. అదీ ఫ్రెండ్స్ మధ్య అయినా.. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సేమ్. కొందరు బానే ఉన్నా.. మరికొందరిలో మాత్రం మార్పు లేదు. దీంతో పట్టింపులు, అలకలు కామనే. అయితే పిల్లలు మారాం చేస్తే.. పేరంట్స్ మందలించాలి.. మరీ పిల్లలు వినకపోతే ఏం చేయాలి.. గట్టిగా చెప్పాలి.. లేదంటే చేయి చేసుకోవాలి.. కానీ ఆ తల్లి ఆసువు బాసింది. భాగ్యనగర నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం రేపింది.

పెద్దలే ఇలా..
మనస్పర్ధలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదీ నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే. చిన్నారుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాల్సిన పెద్దలే ఇలా రాంగ్ స్టెప్ వేయడం విచారకరం. అందరూ కాదు కొందరు ఇలా చేస్తున్నారు. తమ కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కూతురు ఇలా
హైదర్‌గూడ ముత్యాలబాగ్, ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో ఓ ఫ్యామిలీ ఉంది. వారి కుమార్తె స్థానికంగా డిగ్రీ చదువుతోంది. యువతి కొన్నాళ్లుగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. చదువు పక్కనపెట్టి స్నేహితులతో కలిసి టైంపాస్ చేస్తుంది. తల్లి పలుమార్లు మందలించింది. ఆ మాటలను యువతి పెడచెవిన పెట్టింది. దీంతో ఆ కన్నపేగు తల్లడిల్లిపోయింది. తన కూతురు చెప్పిన మాట వినడం లేదని మనస్తాపానికి గురైంది.

ఉరేసుకున్న తల్లి
ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. పిల్ల వినడం లేదని తానే తనువు చాలించింది. ఇదీ చాలా విషాదకరం.. పిల్లలు వినడం లేదని సూసైడ్ చేసుకోవడం దారునం. విషయం తెలిసిన నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

భర్త ఏం పాపం చేశారు..
పిల్లలు వినరు.. మరాం చేస్తారు. పెద్దలు అయితే నచ్చజెప్పాలి. కౌన్సిలింగ్ ఇప్పించాలి. కానీ ఇలా చనిపోయి.. భర్తకు శోకాన్ని మిగిల్చింది. కూతురు చేసిన తప్పుకు ఆ తండ్రికి శిక్ష పడింది. ఆమె భవిష్యత్ పట్టించుకోలేదు. చదువు ఏంటీ.. పెళ్లి ఎలా అనే యోచన లేదు. కానీ భర్తను మాత్రం ఒంటరిని చేసి వెళ్లిపోయింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications