హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

DGP: తెలంగాణలో ఈ సంవత్సరం క్రైమ్ రేటు పెరిగింది: డీజీపీ

|
Google Oneindia TeluguNews

2022 సంవత్సరానికి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డి వార్షిక నివేదిక వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందన్నారు. 57 శాతం సైబర్‌ క్రైమ్‌ నేరాలు పెరిగాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైం రేట్‌ పెరిగిందన్నారు. ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ శాఖ ముందుకు వెళ్ళిందని చెప్పారు.

3 ఎన్‌కౌంటర్లు

3 ఎన్‌కౌంటర్లు

సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయి. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్‌కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు.కన్విక్షన్ రేట్ 50% నుండి 56% పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడిందన్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామన్నారు. 431 మందిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించామన్నారు.

6,157 ఫిర్యాదులు

6,157 ఫిర్యాదులు

రాష్ట్ర వ్యాప్తంగా 2022లో షీ టీమ్స్ కి 6,157 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 2,128 కేసులు నమోదు చేశామన్నారు. డయల్ 100కి 13 లక్షల 77 వేల 113 కాల్స్ వచ్చాయన్నారు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను చేధించామన్నారు. కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగిందని తెలిపారు. 152 మందికి జీవితకాలం శిక్ష పడిందని చెప్పారు.

938 జీరో FIR కేసులు

938 జీరో FIR కేసులు

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 42 వేల 917 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు పేర్కొన్నారు. 13,895 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. 938 జీరో FIR కేసులు వచ్చాయన్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 762 హత్యకేసులు, 2,126 రేప్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించామని తెలిపారు.

పీడీ యాక్ట్

పీడీ యాక్ట్

431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించమన్నారు. ఈ ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయని. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.

English summary
DGP Mahender Reddy disclosed the annual report for the year 2022. He said that the crime rate has increased in Telangana this year. He said that 57 percent cybercrime crimes have increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X