• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Disha Murder case: ఫోరెన్సిక్ ల్యాబ్ కు కీలక ఆధారాలు: డీఎన్ఏ కోసం: చెప్పులు, ఐడీ కార్డు, దుస్తులు..

|

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ కేసులో మరో ముందడుగు పడింది. సంఘటనా చోటు చేసుకున్న స్థలం నుంచి సేకరించిన కొన్ని కీలక ఆధారాలు, వస్తువులను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించనున్నారు. ఈ ప్రక్రియను గురువారం పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  News Roundup : Cabinet Clears Citizenship Amendment Bill || Disha Issue || Oneindia Telugu
   నివేదిక అందిన తరువాతే ఛార్జిషీట్

  నివేదిక అందిన తరువాతే ఛార్జిషీట్

  ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ఇవే కీలక ఆధారాలుగా మారనున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంగా మారనుంది. వెటర్నరి డాక్టర్ దిశను హత్య చేసిన కేసులో శంషాబాద్ పోలీసులు ఇప్పటికే మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు యువకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిపై విచారణ కొనసాగుతోంది.

  నిందితుల తరఫున వాదనలు లేనట్టే.. అయినా

  నిందితుల తరఫున వాదనలు లేనట్టే.. అయినా

  విచారణ సందర్భంగా ఆ నలుగురూ చర్లపల్లిలోని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. నిందితుల తరపున వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. అయినప్పటికీ- చట్టపరంగా నియమ, నిబంధనలను అనుసరిస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తరువాత వారిపై ఛార్జిషీటును నమోదు చేస్తారని తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కొన్ని కీలక అంశాలు తెలుస్తాయని, వాటిని ఛార్జిషీట్ లో పొందుపర్చాల్సి ఉంటుందని, అందువల్లే జాప్యం నెలకొందని చెబుతున్నారు.

  దిశ ధరించిన చెప్పులు, ఐడీ కార్డు, దుస్తులు..

  దిశ ధరించిన చెప్పులు, ఐడీ కార్డు, దుస్తులు..

  అత్యాచారం జరిగిన చోటు నుంచి, మృతదేహం లభించిన షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ స్థలం నుంచి కొన్ని కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించనున్నారు. దిశ ధరించిన చెప్పులు, ఆమె ఐడీ కార్డు, దుస్తులు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు ఖాళీ మద్యం బాటిళ్లు, దిశ మృతదేహాన్ని దగ్ధం చేయడానికి పెట్రోల్ ను తీసుకొచ్చిన ప్లాస్టిక్ బాటిల్ కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు క్లూస్ టీమ్ సేకరించిన కొన్ని వస్తువులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించబోతున్నారు.

   కాలిపోవడంతో జాప్యం..

  కాలిపోవడంతో జాప్యం..

  దిశ మృతదేహాన్ని కాల్చి వేయడం వల్ల కొన్ని కీలక సాక్ష్యాలు మంటల బారిన పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫలితంగా- ఫోరెన్సిక్ ల్యాబరేటరీ అధికారులు సూక్ష్మస్థాయిలో సాక్ష్యాధారాలను పరిశీలించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దిశ లోదస్తులు కాలిపోవడం.. కేసులో దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు. నిజానికి- సంఘటన స్థలంలో లభించిన ఓ లాకెట్ ఆధారంగా అది దిశ మృతదేహమేనని గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే క్లూస్‌ టీమ్ సేకరించిన ఆధారాల్లో డీఎన్‌ఏ నమూనాలు లభించినట్టయితే.. వాటిని కూడా విశ్లేషించే అవకాశం ఉంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The police who collected key evidence in the Disha murder case will be sending it to the forensic lab. They will file a charge-sheet against the accused after getting the. the forensic report which is crucial in the case. Disha's footwear, identity card, and clothes have been recovered from the spot and sent to the forensic lab. The report will be sent to the police in three days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more