ఘ‌ణ‌తంత్య్ర వేడుక‌ల‌కు విఘాతం..! షెడ్యూల్‌ను సవరించాలంటున్న‌ ఉపాధ్యాయ సంఘాలు..!!

హైద‌రాబాద్ : పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం స‌రిగా లేన‌ట్టు తెలుస్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టికే బీసి సంఘం నేత‌లతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తుండ‌గా తాజ‌గా ఉపాద్యాయ సంఘాలు కూడా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీల‌పైన అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. బీసి రిజ‌ర్వేష‌న్ల అంశం తేల్చిన త‌ర్వాతే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప‌లు రాజ‌కీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న త‌రుణంలో, స‌రిగ్గా ఘ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు విఘాతం క‌లిగేలా ఎన్నిక‌ల తేదీలు ఉన్నాయ‌ని వాటిని స‌వ‌రించాల‌ని ఉద్యోగ ఉపాద్యాయ సంఘాలు కోరుతున్నాయి

గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25వ తేదీన రెండో దశ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మెజారిటీ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉండటం, స్కూళ్లలో పోలింగ్‌ నిర్వహించడంతో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం కలుగుతుందని టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్‌, ఎస్జీటీ ఫోరం అధ్యక్షుడు కమ్రొద్దీన్‌ తెలిపారు.

 Disrupt the celebrations 26th. Jan..! Teacher unions demands to change the panchayat elections date..!

ఇప్ప‌టికే బీసి సంక్షేమ సంఘం ప‌లు ఆక్షేప‌ణ‌లు వ్య‌క్తం చేస్తున్న త‌రుణంలో ఇప్పుడు ఉపాద్యాయ సంఘాల అభ్యంత‌రాల‌ను ఎన్నిక‌ల సంఘం ఎలా ప‌రిగ‌ణిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+