Hyderabad Rain: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
హైదరాబాద్ లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికపూల్, బేగంపేట, సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్ పేట, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, జీడిమెట్ల, ప్రగతి నగర్, అల్విన్ కాలనీ, చిలకలగూడ, అడ్డగుట్ట, కంటోన్మెంట్, బోయిన్ పల్లి, కర్ఖాన్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది.
రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నా వర్షంతో నీరు మళ్లీ రోడ్ల పైకి చేరుతోంది. భారీ వర్షాలతో వరద రాడవంతో కొన్ని కాలనీ పార్కు చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకపోయాయి. మరోవైపు అత్యవసమతైనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మియాపూర్ లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. షేక్ పేట 11.9 సెం.మీ. బోరబండలో 11.6 సెం.మీ, మాదాపూర్ లో 10.7 సెం.మీ, రాయదుర్గంలో 8.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో జీడిమెట్ల నుంచి బాల్ నగర్, బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారుల తీవ్ర అవస్థలు పడ్డారు.
జీడిమెట్ల నుంచి బోయిన్ పల్లి వెళ్లడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. సాధారణంగా అయితే అరగంట పడుతుంది. ట్రాఫిక్ జాంతో రోడ్లపైనే గంటల తరబడి ఉండాల్సి వస్తోంది. మేడ్చల్ నుంచి సుచిత్ర, బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ వచ్చే దారిలో కూడా అదే ట్రాఫిక్ జామ్ అయింది. బైకులు, సొంత వాహనాలు అయితే డేంజర్ లో పడతామని అనుకున్న ప్రజలు..సొంత వాహనాలు ఇంటి దగ్గరే వదిలి బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలన్నీ స్ట్రక్ అయిపోయాయి.
వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. నిమిషాల ప్రయాణానికి గంటల తరబడి వాహనాల్లో ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రజలు. అమీర్ పేట్ నుంచి బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే దారి మరింత దారుణంగా మారింది. ట్రాఫిక్ జామ్ తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రోడ్లపై వరదనీరు ప్రవాహంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications