హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కన్ఫామ్.. ఇతర సెట్లు కూడా

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇతర సెట్‌లకు సంబంధించి పరీక్షల తేదీలను అధికారులు ఖరారు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

గత ఏడాది నుంచి స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు మూతపడ్డాయి. వైరస్ విజృంభిస్తుండడంతో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్‌తో కఠిన నిబంధనలు అమలు చేసింది. దీంతో వైరస్ కంట్రోల్ కి వచ్చింది. స్కూళ్లు కూడా జూలై 1వ తేదీ నుంచి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంసెట్ ఇతర పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

eamcet entrance exam conduct on aug 5th

ఆగ‌స్టు 3న ఈసెట్‌, ఆగ‌స్టు 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పీజీ ఈసెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జులై 05వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 03వ తేదీ వరకు దరఖాస్తుల గడువు ఇచ్చారు. ఈ గడువును తర్వాత పెంచారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించ‌నున్నారు.

Recommended Video

Intermediate Weightage Scrapped For Eamcet ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!! || Oneindia

కరోనా వల్ల విద్యా సంవత్సరాలు పొడగిస్తు వస్తున్నారు. పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నడుస్తున్నాయి. 9, 10.. ఇంటర్ విద్యార్థులు కూడా ప్రమోట్ అవుతున్నారు. సీబీఎస్ఈ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు తేదీని పొడగిస్తు వస్తున్నారు. చివరికీ ఖరారు చేశారు.

English summary
eamcet entrance exam conducts on august 5th to 9th Telangana State Council of Higher Education said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X