హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ సమీపంలో భూకంపం.. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రకంపనాలు

|
Google Oneindia TeluguNews

ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్‌లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదు అయ్యింది. హైదరాబాద్‌కు 156 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం ప్రభావం చూపించింది.

నాగర్ కర్నూలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, అచ్చంపేట, ఉప్పునుంతలలో భూప్రకంపనలు సంభవించాయి. సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. మరోవైపు భూప్రకంపనలతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల భూప్రకంపనలు వచ్చి ఉండొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిపుణులు చెపుతున్నారు.

Recommended Video

#earthquake : Earth Tremors Reported In Kukatpally In Hyderabad
 earthquake near at hyderabad

భూకంపంతో ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు కూడా తెలియలేదు. తక్కువ తీవ్రతతో రావడంతో ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు తెలియజేయలేదు.

English summary
earthquake of magnitude 4.0 on the Richter scale hit nagar kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X