• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏక్ నంబర్ మోడీ.. కేసీఆర్ దస్ నంబర్: షర్మిల విసుర్లు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌‌తోపాటు ప్రధాని మోడీపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. దెయ్యాలు దేశాన్ని పాలిస్తుంటే.. భూతాలు రాష్ట్రా న్ని ఏలుతున్నాయని మండిపడ్డారు. నిన్నకేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. మొన్నటివరకు భుజాలు భుజాలు రాసుకొంటూ బీజేపీతో కలిసి తిరిగినప్పుడు గుర్తుకు రానివి, ఏండ్ల కింద ఎన్నడో మిషన్ భగీరథ పనుల ఓపెనింగ్‌కు వచ్చిన సమయంలో మోడీ మాట్లాడిన మాటలు ఇవాళ మీకు గుర్తొచ్చాయా? అని అడిగారు. అప్పుడు భాయి..భాయి, ఇప్పుడు దుష్మన్ డ్రామాలు చేస్తున్నారా? అని అడిగారు.

దస్ నంబర్

దస్ నంబర్

బీజేపీ ఏక్ నంబర్ చోర్ అయితే మీరు దస్ నంబర్ చోర్ అని ఫైరయ్యారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీ రక్తంలో ఉంటే.. సంఘాలను విడగొట్టి, కులాలను రెచ్చగొట్టి, ఉద్యోగులను విడగొట్టి పబ్బం గడుపుకోవడం మీ రక్తంలో ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన కేసీఆర్.. మహిళల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆరేళ్ల పాపపై అఘాయిత్యం చేస్తే కనీసం పట్టించుకోని మీరు మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారా? అని అడిగారు. అధికారంలో ఉన్న పార్టీనాయకులు హత్యలు, హత్యాచారాలు చేస్తే కాపాడాలని రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఉందనే మీ పాలనలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పార్టీనాయకులు అందులో నిందితులుగా
ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారా? అని అడిగారు.

మంత్రి పదవీ ఇవ్వకుండా..

మంత్రి పదవీ ఇవ్వకుండా..

మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆరేళ్లుగా అన్యాయం జరిగినప్పుడు గుర్తుకు రాని మహిళా న్యాయం ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. బీసీ కులగణన చేయాలని బీసీలు మొత్తుకుంటున్నా బీజేపీ వినడం లేదని చెబుతున్నారే.. మరి బీసీలకు మీరు ఏం చేశారని అడిగారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ సీఎం
చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు ఖండించదగినదే, కానీ మీరు నోరు తెరిస్తే మీ నోటి నుంచి జాలువారే.. ఆణిముత్యాల తిట్ల దండకాన్ని ఎవరు ఖండించాలి అన్నారు.
నల్ల చట్టాలను తెచ్చి రైతులపై నుంచి కార్లెక్కర్లెక్కించి రైతులను చంపిన చరిత్ర బీజేపీ పార్దైతే .. రైతులను ఆదుకోకుండా, వాళను ఆత్మహత్య చేసుకొనేలా చేసి రైతు ఆత్మహత్యలో దేశంలోనే రాష్ట్రా న్ని నాలుగో స్థానంలో నిలిపిన ఘనత మీది కేసీఆర్ అని చెప్పారు.

మోసం.. మోసం...

మోసం.. మోసం...


ఎరువుల సబ్సిడీకి, ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించకుండా బీజేపీ మోసం చేస్తే .. ఉచిత ఎరువులిస్తాం అని మీరు మోసం చేసింది మర్చిపోయారా? అని అడిగారు. మోడీ పాలనలో దేశం వెనుకబడి పోయింది .. నిరుద్యోగ రేటు పెరిగిపోయిందన్నారు. ఎన్నికలు వస్తే దళితుల ఇండ్లల్లో భోజనాలు చేసే డ్రామా బీజేపీ ఆడితే, ఎన్నికలప్పుడే మీకు దళితుల మీద ప్రేమ పుట్టుకొ చ్చి దళిత బంధు పథకాలు తీసుకొస్తారని విరుచుకుపడ్డారు. దళితులు ఏం తినాలి, ఏం తినకూడదని బీజేపీ డిసైడ్ చేసి దాడులు చేస్తే, మీరు అక్రమ రవాణా అడ్డుకున్నారని నేరేళలో దళితులఫై థర్ ్ల డిగ్రీ ప్రయో డ్ గించి ప్రేమ చూపెట్టలేదా? ఈ రోజు మీ పాలనలో దళితుల మీద దాడులు పెరిగిపోయింది మీకు తెలియదా కేసీఆర్ అని మండిపడ్డారు.

10 వేల కోట్లు..

10 వేల కోట్లు..


రాజ్యాంగం నుంచి SC సబ్ ప్లాన్‌ను బీజేపీ తీసేసి దళితులను మోసం చేసిందని దళితుల మీద ప్రేమ కురిపిస్తూ.. సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్.. ఏటా 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఏడేండ్లలో ఎన్ని కోట్లు దళితుల కోసం ఖర్చు పెట్టారని అడిగారు. SC సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి న ఘన చరిత్ర మీది కదా కేసీఆర్.. ప్రజల మంచి కోసం రాజ్యాంగాన్ని సవరించుకొనే అవకాశాన్నిరాజ్యాంగమే కల్పించినప్పుడు ఆ సవరణలను ఒదిలేసి
మొత్తం రాజ్యాంగం మౌలిక రూపాన్నే మార్చాలనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు.

English summary
ek number modi, das number kcr ys sharmila alleges. they two persons are cheating people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X