వంద మంది టీచర్లపై సస్పెన్షన్.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ : ఎలక్షన్ డ్యూటీకి రాని టీచర్లపై వేటు పడింది. దాదాపు వంద మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 23 మంది టీచర్లు సస్పెన్షన్ కు గురయినట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరత కారణంగా అంగన్ వాడీ టీచర్లకు కూడా ఎలక్షన్ డ్యూటీలు వేశారు ఉన్నతాధికారులు. అసలే సిబ్బంది కొరతతో సతమతమవుతుంటే.. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయడమేంటనే కారణంగా వంద మంది టీచర్లపై వేటు వేశారని తెలుస్తోంది.

election duty absence cause to hundred teachers suspension

అయితే ఎన్నికల విధులకు ఎవరైతో హాజరుకాలేదో వారు సంజాయిషీ ఇచ్చుకోవచ్చని తెలిపారు ఉన్నతాధికారులు. వారిచ్చే సమాధానం సహేతుకమైనది ఐతే పరిగణనలోకి తీసుకుంటామంటున్నారు. అదలావుంటే పోలింగ్ సిబ్బందికి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతి కల్పించలేదనే వాదనలున్నాయి. మంచినీళ్లు, భోజనం దొరక్క తీవ్ర అవస్థలు పడ్డట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+