మద్యం షాపులను వెంటనే మూసివేయండి, ఒక్కరోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క
తెలంగాణ రాష్ట్రంలో తెరచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యోతక్క ఒక్కరోజు దీక్ష చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో దీక్ష చేశారు. మద్యం షాపులను వెంటనే మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మద్యం షాపుల తెరవడంపై సీఎం కేసీఆర్ మరోసారి ఆలోచించాలని ఆమె కోరారు. లిక్కర్ షాపులకు బార్లా తెరవడంతో.. వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ఆందోళన నెలకొందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల పేదలు, మధ్యతరగతి వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని.. వైన్ షాపులకే మందుకే డబ్బులు ఇస్తే.. కుటుంబాల సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. లిక్కర్ షాపులను వెంటనే మూసివేయాలని.. లేదంటే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని కొమిరెడ్డి జ్యోతక్క హెచ్చరించారు.

బుధవారం నుంచి తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే వైన్ షాపుల వద్ద ప్రజలు గుమిగూడి ఉండటంతో ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తి చెందుతుందోననే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే కొందరు వైన్ షాపులు మూసివేయాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క ఒకరోజు దీక్ష చేపట్టారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications