కవిత ఓటమికి కేసీఆర్ కారణం, బూర నర్సయ్య సంచలన వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ దుమారం ఇంకా కొనసాగుతోంది. దీనిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. తన రాజకీయాల కోసం కూతురు కవిత రాజకీయ జీవితాన్ని కేసీఆర్ పణంగా పెట్టారని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమికి కేసీఆరే కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల కోసం కూతురు కవిత పేరును వాడుకోవటం ఒక్క కేసీఆర్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు. మరో పవర్ సెంటర్ కాకూడదని కూతురు అని కూడా చూడకుండా నిజామాబాద్‌లో కవిత ఓడిపోవటానికి ప్లాన్ ప్రకారం చేశారని కామెంట్ చేశారు. కవిత ఓటవి వెనుక కేసీఆర్ హస్తం ఉందని.. ప్లాన్ ప్రకారమే కవిత ఓడిపోయేలా కేసీఆర్ చేశారని కామెంట్ చేశారు.

కవిత కాదు సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోం అని ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అనేది పెద్ద సమస్య కాదని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలు సహా ఎవరైనా సీఎం కావొచ్చని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బీసీలు రాజకీయ సమాధి కట్టటం ఖాయం అని మంపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో బీసీలు వివక్షకు గురి అవుతున్నారనిఅసంతృప్తి వెళ్లగక్కారు. అభిమానానికి బానిసత్వానికి చాలా తేడా ఉందని.. తన ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించారని అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications