Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విస్త‌రిస్తున్న న‌గ‌రం..! మెరుగైన ర‌వాణా వ్య‌వ‌స్థ కోసం ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు..!!

హైదరాబాద్: న‌గ‌రం విస్త‌రిస్తోంది. జ‌నాలు పెరిగిపోతున్నారు. కిట‌కిట‌లాడుతున్న మ‌హాన‌గ‌రం న‌డిబొడ్డున ఉండేలేక సిటీకి దూర‌ప్రాంతాల‌ను ఎంచుకుని ప్రశాంత జీవ‌నానికి ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డిపోతున్నారు. సొంత ఇళ్లు, అపార్టు మెంట్లు, విల్లాలు ఇలా ఎవ‌రి స్థోమ‌త‌ను బ‌ట్టి వారు త‌మ‌త‌మ నివాసాల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకుంటున్నారు. పెరుగుతున్న‌న‌గ‌ర పౌరుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం సౌరక‌ర్యాల‌ను కూడా క‌ల్పిస్తోంది. ముఖ్యంగా ర‌వ‌ణ వ్య‌వ‌స్థ విస్త‌ర‌ణ పై ద్రుష్టి సారించిన ప్ర‌భుత్వం ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. పౌరుల రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా ముందుజాగ్ర‌త్తలు తీసుకుంటుంది టీఎస్ఆర్టీసి.

ఇక న‌గ‌రంలో వేగ‌వంత‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌..! కార్యాచ‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం..!!

ఇక న‌గ‌రంలో వేగ‌వంత‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌..! కార్యాచ‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం..!!

న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యాల‌ను క‌ల‌గ కూడ‌ద‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వేగ‌వంత‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌కోసం కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. నగరంలోని కొన్ని రూట్లలో నాన్‌స్టాప్ సర్వీ సులు అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉన్న మార్గాలు, సర్వీసులు నడిచే రూట్లలోనే ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. కొన్ని రూట్లలో బస్ స్టార్ట్ అయ్యే పాయింట్లోనే సీట్లు నిండిపోతున్నాయి. అటువంటి బస్సును ట్రాఫిక్ రద్దీ మార్గాల గుండా తీసుకెళ్తూ ప్రతీ స్టాపులో బస్సును ఆపుతూ వెళ్లడం ద్వారా నిర్దేశిత సమయానికి బస్సు గమ్యం చేరుకోలేక పోతున్న అంశాన్ని అదికారులు గుర్తించారు.

అన్నీ ప్రాంతాల‌ను క‌లుపుతూ బ‌స్సులు..! ప్ర‌యాణీకుల సౌక‌ర్య‌మే ముఖ్యం..!!

అన్నీ ప్రాంతాల‌ను క‌లుపుతూ బ‌స్సులు..! ప్ర‌యాణీకుల సౌక‌ర్య‌మే ముఖ్యం..!!

ప్ర‌యాణీకుల‌ను ఎక్కించుకో లేని పరిస్థితి ఉన్న బస్సు లను కూడా ప్రతీ స్టాపులో నిలిపివేసి బయలుదేరుతున్నాయి. ఇటువంటి చర్య వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ ,గచ్చి బౌలి వంటి ఐటీ కారిడార్లతోపాటు శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు.ఎంజీబీఎస్,జేబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లకు ర‌ద్దీ స‌మ‌యాల్లో నాన్‌స్టాఫ్ బస్సులు నడుపాలని యోచిస్తున్నారు.

నాన్ స్టాప్ బ‌స్సుల‌ను ప్ర‌వేశం కోసం క‌స‌ర‌త్తు..! స‌మ‌యం ఆదా పై ఆర్టీసి ద్రుష్టి..!!

నాన్ స్టాప్ బ‌స్సుల‌ను ప్ర‌వేశం కోసం క‌స‌ర‌త్తు..! స‌మ‌యం ఆదా పై ఆర్టీసి ద్రుష్టి..!!

ముఖ్యంగా ఉప్పల్ నుంచి గచ్చిబౌలి, వేవ్‌రాక్, మాదాపూర్ మార్గంలో నడిచే 113, కోఠి నుంచి నడిచే 222, 127, మొహిదిపట్నం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు నడిచే 49, ఇబ్రహీంపట్నం నుంచి సికింద్రాబాద్ మీదుగా జేబీఎస్‌కు రాకపోకలు సాగించే 279 తో పాటు మరిన్నిరూట్లలో తిరిగే బ‌స్సుల స‌మ‌యపాల‌న‌పై అధికారులు పున‌రాలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. నాన్‌స్టాప్ సర్వీ సులను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. నాన్‌స్టాప్‌గా నడిచే బస్సులన్నీ ఏసీ బస్సులు ఏర్పాటు చేయాలని స‌న్నాహాలు చేస్తున్నారు ర‌వాణా శాఖ అదికారులు.

మెట్రో రూట్ల‌లో త‌గ్గిన బ‌స్సులు..! అద‌న‌పు రూట్ల‌పై అదికారుల క‌స‌ర‌త్తు..!!

మెట్రో రూట్ల‌లో త‌గ్గిన బ‌స్సులు..! అద‌న‌పు రూట్ల‌పై అదికారుల క‌స‌ర‌త్తు..!!

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అధికారులు దీనిపై కొంత కసరత్తు చేసిందని, పూర్తి స్థాయి అధ్యయనం చేసి లాభ, నష్టాలు , మెరుగైన సేవల వంటి అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకుని అమల్లోకి తీసుకురావాలని భావిస్తు న్నారు. మెట్రోరైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కొంతశాతం తగ్గిందని అదికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అద‌న‌పు రూట్ల వైపు ఆర్టీసీ బ‌స్సుల‌ను మ‌ళ్లించేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌ల‌రు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+