హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాన్స్‌పోర్టులో పేలుడు పదార్థాలు.. పోలీసులకు సమాచారం.. ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయిం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల వనస్థలిపురంలో పేలుడు పదార్థాలు కనిపించాయి. వనస్థలిపురం నవతా ట్రాన్స్‌పోర్టులో ఇటీవల వచ్చిన ఓ కొరియర్‌ పార్సెల్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. 8 కార్టన్లలో పేలుడు పదార్థాలు కనిపించాయి. ఇవీ చిలకలూరిపేట నుంచి పుణెకు పార్సిల్‌ చేయబడ్డాయి. మార్చి 15వ తేదీన హైదరాబాద్‌కు కొరియర్‌ చేరుకోగా ట్రాన్స్‌పోర్టు సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం వాటిని పరిశీలించారు.

8 కార్టన్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పేలుడు పదార్థాలు సినిమాల్లో వాడే బాంబులుగా నిర్ధారించారు. మొత్తం 8 కార్టన్లలో సుమారు 100 బాంబులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

explosives found in private transport parcel in hyderabad

అయితే పేలుడు పదార్ధాలు తరలింపుకు లైసెన్స్ ఉందా? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరి పేరుపై ఉన్నాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఈ ఘటన మాత్రం కలకలం రేపింది. నయం ఆ పేలుడు పదార్థాలు అలానే ఉన్నాయి. ఏ మాత్రం పేలలే.. లేదంటే మరోలా ఉండేది. అయితే సినిమాల్లో వాడేవి అని చెప్పడంతో ఆ స్థాయిలో నష్టం ఉండదని మరికొందరు అంటున్నారు.

English summary
explosives found in private transport parcel in hyderabad. police investigate to this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X