హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

fake app:పయటీఎంతో చెల్లింపు.. స్కాన్ చూపించి పరార్.. 4 చోట్ల షాపింగ్, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మోసం నయపుంతలు తొక్కుతోంది. ఛీటర్లు టెక్నాలజీని వాడుతున్నారు. రోజుకో తరహాలో మోసం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతోంది. ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారు. క్యాష్ ట్రాన్స్ ఫర్ ఇట్టే జరిగిపోతోంది. అయితే పేటీఏం ద్వారా కూడా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనికి కొందరు ఆసరాగా తీసుకున్నారు. పయటీఎం పేరుతో యాప్ రెడీ చేశారు. ఇంకేముంది పేటీఎం లాగా ఉండటం.. నగదు బదిలీ అయిందని చూపించారు. అలా వేలకు వేలు షాపింగ్ చేశారు. నగదు రాకపోవడంతో మోసపోయాయని గ్రహించిన యాజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫేక్ యాప్ భాగోతం వెలుగుచూసింది.

నకిలీ యాప్‌తో మోసం..

నకిలీ యాప్‌తో మోసం..

నకిలీ యాప్‌ పయటీఎంతో చెల్లింపు అయిపోయిందని ఫోన్‌ చూపించి సామగ్రి తీసుకుని వెళ్లుతున్నారు కొందరు. నాలుగు పోలీ‌స్ స్టేషన్లలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో రూ.28 వేలకు దుస్తులు కొనుగోలు చేసి ఉడాయించారు. చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో రూ.8500 విలువ చేసే క్రీడా పరికరాలు షాపింగ్ చేశారు. అక్కడే రూ.10700 విలువ చేసే నిత్యావసర వస్తువులు రూడా తీసుకున్నారు. ఇక మీర్‌చౌక్‌ పీఎస్‌ పరిధి గురించి చెప్పక్కర్లేదు. రూ.28వేలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఉడాయించారు.

8 మంది అరెస్ట్..

8 మంది అరెస్ట్..


షాపు నిర్వాహకుల ఫిర్యాదుల మేరకు కేసు ఫైల్ చేశారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 8 మంది ముఠాను గుర్తించారు. డబీర్‌పురాకు చెందిన మహమ్మద్‌ ముస్తఫా అనే విద్యార్థి, ఆసీఫ్ నగర్‌‌కు చెందిన సయ్యద్‌ ఆమిర్, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సయ్యద్‌ ఇలియాస్, సయ్యద్‌ వాజిద్‌, మెహదీపట్నం నివాసి హఫీజ్‌ రాణా , కాలాపత్తర్‌ నివాసి మహమ్మద్‌ సల్మాన్‌, ఆసీఫ్ నగర్‌కి చెందిన మహమ్మద్‌ షాహెద్‌ , కాలాపత్తర్‌ నివాసి మహమ్మద్‌ యూసుఫ్‌ మోసం చేశారని గుర్తించారు.

నలుగురు విద్యార్థులే

నలుగురు విద్యార్థులే

8 మందిలో నలుగురు విద్యార్థులే ఉన్నారు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోలతో ఇలాంటి మోసం గురించి తెలుసుకున్నారు. విషయం తెలియడంతో ప్లే స్టోర్‌.. కొన్ని యాప్‌లను ఇప్పటికే డిలీట్‌ చేసింది. ఇంకా కొన్ని యాప్స్ కొనసాగుతున్నాయి. నకిలీ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ సూచించారు.

English summary
fake app: 8 people cheat with fake app in hyderabad. they shopping and show scan code in fake app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X