హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహా

|
Google Oneindia TeluguNews

బిల్డప్ బాబాయిని మించిన గప్పాలు కొడుతూ, తాము బడా బాబులమని పోజులిస్తూ నేరాలకు పాల్పడినవాళ్లను చాలా మందిని చూశాం. కానీ ఇది అన్నిటిలోకీ సంచలన క్రైమ్. కేవలం అమ్మాయిలను వలలో వేసుకోడానకి ఏకంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసు అంటూ ఓ సెటప్ వేసిన ఘనుడొకడు.. నిత్యం ఆర్మీ మేజర్ దుస్తుల్లో దర్శనమిస్తూ, పెళ్లి పేరుతో ఏకంగా 17 మంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడు. విచిత్రం కాకుంటే ఉన్నతాధికారిణి అయిన భార్యను కూడా ఇతను వదల్లేదు. మొత్తంగా రూ.6కోట్ల పైచిలుకు సొత్తును కాజేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చెరలో ఉన్న ఈ ఘరానా నేరగాడి గురించి సీపీ అజనీ కుమార్ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు..

కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్

పేరు ముదావత్ శ్రీను నాయక్..

పేరు ముదావత్ శ్రీను నాయక్..

ఏపీలోని ప్రకాశం జిల్లా, కీలంపల్లి గ్రామం, పాలుకురల్ల తండాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ అలియాస్ శ్రీనివాస్ చౌహాన్(42) నిరుద్యోగి. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, సైనికప్ పురిలో ఉంటున్నాడు. అతను చదవివింది 9వ తరగతే అయినా, మేఘాలయ సీఎంజీ వర్సిటీ నుంచి ఎంటెక్(ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్) పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసుకున్నాడు. వాటి ఆధారంగా 2002లో గుంటూరు వైద్య శాఖ ఉన్నతాధికారిణి హోదాలో ఉన్న మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. భార్యాకొడుకులు గుంటూరు జిల్లా వినుకొండలో ఉంటోండగా, శ్రీనివాస్ నాయక్ మాత్రం 2014 నుంచి హైదరాబాద్ లో మకాం వేసి భారీ క్రైమ్ పథకాన్ని అమలు చేశాడు..

ఆధార్ కార్డులోనూ ఆర్మీ మేజర్..

ఆధార్ కార్డులోనూ ఆర్మీ మేజర్..

హైదరాబాద్ లో శ్రీనివాస్ చౌహాన్ పేరిట తీసుకున్న ఆధార్ కార్డులో తాను ఆర్మీ మేజర్ అని నమోదు చేయించాడు. సోషల్ మీడియా ఖాతాల్లోనూ అదే డిజిగ్నేషన్ తో, ఆర్మీ యూనిఫామ్ లో దిగిన ఫొటోలను అప్ లోడ్ చేశాడు. పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందానని చెప్పుకున్న ఈ మోసగాడు.. దేశ సేవలో నిమగ్నమైపోవడంతో ఇంత కాలం పెళ్లి చేసుకోలేదని, సరైన అమ్మాయి దొరికితే అందుకు సిద్ధమని చెప్పుకునేవాడు. మ్యాట్రిమోని వెబ్ సైట్ల ద్వారా వరుడి కోసం ఎదురు చూస్తోన్న అమ్మాయిలకు తన వివరాలు పంపేవాడు. తన వలలలో చిక్కిన అమ్మాయి కుటుంబీకులతో ఆర్మీ దుస్తుల్లోనే ఉండి ఆన్ లైన్ లో మాట్లాడేవాడు. అందుకోసం..

ఉప్పల్‌లో ఆర్మీ ఆఫీస్..

ఉప్పల్‌లో ఆర్మీ ఆఫీస్..

ఫేక్ ఆర్మీ మేజర్ గా శ్రీను నాయక్ ఎంత పకడ్బందీగా వ్యవహరించేవాడంటే.. ఉప్పల్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని, దాన్ని ఆర్మీ మేజర్ ఆఫీసుగా ముస్తాబు చేశాడు. ఎవరితోనైనా ఇక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడేవాడు. అమ్మాయిలు, వారి కుటుంబీకులతో చనువు పెరిగిన తర్వాత.. ఏదో అవసరం ఉందని నమ్మించి లక్షల్లో డబ్బులు దండుకునేవాడు. ఇలా మోత్తం 17 మంది అమ్మాయిలతో శ్రీను నాయక్ ఆటలాడుకుని, వారి నుంచి ఏకంగా రూ.6.61కోట్లను స్వాహా చేశాడు.

భార్య నగ్న వీడియోలు ఇంటర్నెట్‌లో -ఈజీ మనీ కోసం ఓ భర్త వికృతం -గుంటూరు దిశ స్టేషన్‌లో కేసుభార్య నగ్న వీడియోలు ఇంటర్నెట్‌లో -ఈజీ మనీ కోసం ఓ భర్త వికృతం -గుంటూరు దిశ స్టేషన్‌లో కేసు

అడ్డంగా దొరికిపోయినా ఆగలేదు..

అడ్డంగా దొరికిపోయినా ఆగలేదు..

తెలంగాణ సెక్రటేరియట్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న ఓ పెద్దాయన.. మెడిసిన్ చదివిన తన కూతురికి శ్రీను నాయక్ తో పెళ్లిని ఖరారు చేశాడు. తీరా పెళ్లి పత్రికలు అచ్చయిన తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని శ్రీను తన ఖాతాలోకి రూ.56లక్షలు వేయించుకున్నాడు. వరంగల్ కు చెందిన ఓ కుటుంబం నుంచి ఏకంగా రూ.2 కోట్లు లాగేశాడు. హైదరాబాద్ కే చెందిన మయో యువతికి.. తాను ఖరగ్ పూర్ లో ఐఐటీ చేశానని బిల్డప్ ఇచ్చి దగ్గరయ్యాడు. కానీ ఆ అమ్మాయి.. ఐఐటీలో విచారించగా, శ్రీను నాయక్ చెప్పింది అబద్ధమని తేలిపోయింది. దీంతో ఆమె అతణ్ని నిలదీసింది. అయినాసరే ఏమాత్రం భయపడకుండా, మాయమాటలతో అమ్మాయిని నమ్మించి, చివరకు ఆమె దగ్గర్నుంచి రూ.76లక్షలు కాజేశాడు.

Recommended Video

Heavy Rainfall In AP & TS రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం.. 24, 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు
భార్యను కూడా వదలని మోసగాడు..

భార్యను కూడా వదలని మోసగాడు..

ఇంత బరితెగింపుగా శ్రీను నాయక్ మోసాలకు పాల్పడిన శ్రీను నాయక్ పై హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. సిటీలోని జవహర్ నగర్ స్టేషన్ లో ఇతనిపై ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసులున్నాయి. శనివారం శ్రీను నాయక్ కారులో మరో అమ్మాయిని మోసం చేయడానికి వెళుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. తాను ఆర్మీ మేజర్ అని భార్యను కూడా నమ్మించిన ఈ కేటుగాడు.. ఇటీవలే ఆమె నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ వివరించారు.ఉప్పల్‌లోని శ్రీనివాస్‌నాయక్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. డమ్మీ పిస్టోల్‌, నకిలీ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులతోపాటు బెంజికారు, పార్చునర్‌, మహీంద్రాథార్‌ జీప్‌తోపాటు రూ. 85వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.

English summary
42-year-old Mudavath Srinu Naik posing as an Army officer was arrested by the Hyderabad Task Force sleuths, on Saturday, for duping 17 women on the pretext of marriage. He collected Rs 6,61,02,000 from these women and their families and purchased a duplex house with the ill-gotten money. Srinu Naik, a resident of Sainikpuri. Police seized dummy weapon, Army uniform, fake ID card, and fake educational certificates from the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X