రూ.40 వేలు.. ఒక్కో సర్టిఫికేట్ ఖరీదు, ముఠా అరెస్ట్: సీపీ మహేశ్ భగవత్
భవితకు బాటలు వేసివి సర్టిఫికేట్స్.. ఏదైనా సరే ధృవపత్రాలతోనే సరి.. కానీ కొందరు ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. కరెన్సీనే దొంగనోట్లుగా మలుస్తోన్న ఘనులు ఉన్నారు. ఇక సర్టిపికేట్లను కూడా వదలడం లేదు. అవును ఫేక్ ఇస్తూ.. మోసం చేస్తున్నారు. అందుకు పెద్ద మొత్తంలో నగదు వసూల్ చేస్తున్నారు. ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు కేవలం మన రాష్ట్రంలోని వర్సిటీలే కాదు కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారని విచారణలో తేలింది.

రూ.30 వేల నుంచి రూ.40 వేలు
ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రోహిత్ ఐటీ ఉద్యోగి.. ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇంకేముంది కొందరినీ కలుపుకొని శ్రీ లక్ష్మీ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. ఏ సర్టిఫికేట్ అడిగితే అదీ ఇచ్చేవాడు.. కానీ ఒక్కో దానికి రూ.30 నుంచి రూ.40 వేల వరకు వసూల్ చేశాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి భారీగానే దండుకున్నారు.

కేయూ, జేఎన్టీయూ, నాగార్జున వర్సిటీ
తెలంగాణ రాష్ట్రంలో గల కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఏపీలో గల ఆచార్య యూనివర్సిటీ కర్ణాటకకు చెందిన వర్సిటీల నుంచి సర్టిపికేట్స్ తయారు చేశారు. అయితే సదరు వర్సిటీల నుంచి లేని కాలేజీల నుంచి కూడా ధృవపత్రాలు జారీ చేశారు. దీంతో వీరి భాగోతం బయటపడింది. విదేశాలకు వెళ్లేవారు సర్టిపికేట్లు తీసుకుంటున్నారు. 20 ధృవపత్రాలు ఇచ్చినట్టు తెలిసింది. నిందితుల నుంచి నకిలీ సర్టిఫికేటలు, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మొబైల్ పోన్స్ సీజ్ చేశారు.

తిరిగొచ్చి అప్పుల్లో కూరుకుపోయి
చదవితేనే సర్టిఫికేట్.. కానీ చదవకుండా.. విద్యా ప్రమాణాలు లేకుండా కొందరు తీసుకుంటున్నారు. మరికొందరు వాటిని విక్రయిస్తున్నారు. ఇదీ తప్పు అని ఇచ్చేవారికి కూడా తెలుసు. కానీ డబ్బుల కోసం అలా చేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విదేశాలకు వెళితే.. ఇక అంతే సంగతులు. సదరు కంపెనీలు తిరిగి పంపిస్తే వారి సంగతేంటో అర్థం కావడం లేదు. పొట్ట చేత పట్టుకొని వెళ్లినవారు.. తిరిగి వచ్చి అప్పుల్లో కురుకుపోయి ఉంటారు. తిరిగి ఇతర కంపెనీకి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు.












Click it and Unblock the Notifications